ప్రతి మనిషికి కొన్ని చెడు అలవాట్లు ఉంటాయి. చిన్న వయసులో సరదాగా అలవాటు చేసుకున్న వాటిని పెద్దయ్యాక అవి తప్పు అని తెలుసుకుని మానేస్తూ ఉంటారు. అయితే కొంతమంది పెద్దయ్యాక కూడా ఆ అలవాట్లు చెడ్డవని తెలిసినా వదిలేయరు. అలాంటి వారు చాలా క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఊహించని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ చిన్నప్పుడు తెలిసీ తెలియక చేసిన తప్పులు, అలవాట్లు పెద్దయ్యాక చాలామంది మార్చేసుకుంటారు. అందులో స్టార్ హీరోలు, హీరోయిన్లు కూడా ఉన్నారు. ఇప్పుడు అలాంటి ఒక న్యూస్ ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతోంది. ఇండస్ట్రీలో టాప్‌లో ఉన్న అందాల ముద్దుగుమ్మల గత చెడు అలవాట్ల గురించి ఓ వార్త బాగా ప్రచారంలో ఉంది. అసలు ఆ హీరోయిన్లు ఎవరు..? ఆ చెడు అలవాటు ఎలా అలవాటు అయ్యాయి..? ఎలా మానుకున్నారు..? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..!!


సమంత: ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్ సమంత. ఆమెను ఇన్స్పిరేషన్‌గా తీసుకునే వారు చాలా మంది ఉన్నారు. ఆమె పెళ్లి, విడాకులు వంటి ప్రతి వార్త సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటుంది. అయితే సమంత సరదాగా ఫ్రెండ్స్‌తో చేసిన ఒక పని సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆమె తన కాలేజీరోజుల్లో ఫ్రెండ్స్‌తో సరదాగా సిగరెట్ తాగిందట. అదే మొదటి, అదే చివరి సారి. కానీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత దాన్ని పెద్ద విషయంగా తీసుకుని పదేపదే ఆమెను ట్రోల్ చేసిన వారు ఉన్నారు. సమంత తన ఇంటర్మీడియట్ రోజుల్లో సరదాగా ఫ్రెండ్స్‌తో తెలిసీ తెలియక స్మోకింగ్ చేసిందని చాలా రకాల వార్తలు వినిపించాయి. ఆ తర్వాత దాన్ని పెద్ద వివాదంగా మార్చి సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేశారు.



పూజా హెగ్డే:  టాలీవుడ్‌లో బుట్ట బొమ్మగా పూజా హెగ్డే తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంది. ఫ్లాప్స్ పడ్డా కూడా పూజా పేరు ఎప్పుడూ సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటుంది. అయితే ఒకప్పుడు పూజా హెగ్డేకి సిగరెట్ తాగే అలవాటు ఉందని, అది ఇప్పటికీ కొనసాగుతుందని బాలీవుడ్‌లో అనేక రకాల వార్తలు వచ్చాయి. తెలుగులో కూడా మిస్టర్ బ్యూటీ కావడంతో తెలుగు మీడియాలో ఆమె స్మోకింగ్ అలవాటు గురించి అప్పట్లో బాగా వార్తలు వినిపించాయి.



రకుల్ ప్రీత్ సింగ్: టాలీవుడ్‌లో ఈ బ్యూటీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమా ద్వారా తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తనదైన స్టైల్‌తో నటించి, బాలీవుడ్‌లో కూడా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అయితే రకుల్‌కీ స్మోకింగ్, డ్రింకింగ్ అలవాట్లు ఉన్నాయని వార్తలు వచ్చాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ సమయంలో ఫ్రెండ్స్‌తో సరదాగా చేసిన స్మోకింగ్ తర్వాత అది అలవాటుగా మారి, తర్వాత కూడా కొనసాగించిందని అంటారు.



శ్రుతి హాసన్:  కమల్ హాసన్ ముద్దుల కూతురు శ్రుతి హాసన్ ఎంత ట్రెండీగా ఉంటుందో అందరికీ తెలుసు. మద్యం సేవించడం, సిగరెట్ తాగడం గురించి సోషల్ మీడియాలో తరచూ వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ఆమె చేసే పనులు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటాయి. ముఖ్యంగా అనేక బాయ్‌ఫ్రెండ్స్‌ను మార్చిన బ్యూటీ అంటూ సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేస్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: