తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడుగా, నిర్మాతగా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న బండ్ల గణేష్ ఈమధ్య సినిమాలలో కంటే నిరంతరం పొలిటికల్ పరంగా యాక్టివ్ గా ఉన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ట్విట్టర్ ఖాతాలో ఎప్పుడు ఏదో ఒక విషయాన్ని ట్వీట్ చేస్తూ సంచలనంగా మారుతున్నారు బండ్ల గణేష్. ఇటీవల కాలంలో బండ్ల గణేష్ చేస్తున్న ట్వీట్స్ ఒక వ్యక్తి గురించి అన్నట్టుగా మరింత వైరల్ గా మారుతున్నాయి.


ముఖ్యంగా సినిమా ఫంక్షన్స్ లో బండ్ల గణేష్ మాట్లాడే మాటలు చాలా భిన్నంగా ఉంటాయి. మైక్ అందుకున్నారంటే చాలు ఏదో ఒక సంచలన విషయాన్ని సృష్టిస్తుంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి గతంలో ఎన్నో సందర్భాలలో మాట్లాడారు బండ్ల గణేష్. ఇటీవలే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ను ఉద్దేశిస్తూ కూడా చేసిన కామెంట్స్ పెద్ద వివాదానికి దారితీసాయి. ఇప్పుడు తాజాగా బండ్ల గణేష్ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేశారో తెలియడం లేదు కానీ ఒక ట్విట్ అయితే చేశారు..


ట్విట్టర్ విషయానికి వస్తే.. "అతను గతం, వర్తమానం, భవిష్యత్తు గురించి అబద్ధాలు చెప్పగలరు.. అతను తన గురించి ఎక్కువగా అబద్ధాలు చెబుతూ ఉంటారు, తన విద్య, నేపథ్యం, విజయాల గురించి అబద్ధాలు చెబుతూ ఉంటారు, తన వైఫల్యాల గురించి కూడా అబద్ధాలు చెబుతూ ఉంటారు, అలాగే అబద్ధం గురించి కూడా అబద్ధం చెప్పగలరు, సాక్ష్యం ఉన్నప్పుడు ఇతరులే అబద్ధం చెప్పారని కూడా చెబుతారని త్వరలో ఒక కొత్త అబద్దాలకు వెళ్తాడు అంటూ ఒక సంచలన ట్వీట్ చేశారు బండ్ల గణేష్.


ఈ ట్వీట్ చూసిన అభిమానులు కన్ఫ్యూజన్లో పడేస్తున్నావ్ బండ్లన్న కనీసం ఎవరి గురించి రాస్తున్నావో క్లారిటీ ఇవ్వు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది పేర్లును ట్యాగ్ చేస్తూ ఈ ట్విట్టర్ ను వైరల్ గా చేస్తున్నారు. మరి ఈ విషయంపై బండ్ల గణేష్ ఎలా క్లారిటీ ఇస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: