ఏ హీరోకైనా అతని నిజమైన బలం అంటే అతని ఫ్యాన్స్ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఫ్యాన్స్ ప్రేమిస్తే ఆ హీరోను ఆకాశానికెత్తుతారు, కానీ అదే సమయంలో ఫ్యాన్స్ మనసు దెబ్బతింటే ఆ హీరోకీ, ఆయన టీంకీ భారీ నెగిటివిటీ ఎదురవుతుంది. ఇదే సంగతి ఇప్పుడు పాన్-ఇండియా డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి విషయంలోనూ కనిపిస్తోంది. తెలుగు సినీ పరిశ్రమకు బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి మాస్టర్పీస్‌లను అందించిన రాజమౌళి, తన సక్సెస్‌నే ఒక ఇంటిపేరుగా మార్చుకున్న విజనరీ డైరెక్టర్. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఒక భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ మొదటి రోజు నుంచే ఇండస్ట్రీలో సూపర్ హైప్ క్రియేట్ చేసింది.


అయితే ఆశ్చర్యకరంగా రాజమౌళి ఈ సినిమాకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్‌ కూడా ఇంతవరకు రిలీజ్ చేయలేదు. ఇదే ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్‌లో నిరాశకు కారణమైంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, రాజమౌళి ప్రస్తుతం మరో ప్రాజెక్ట్ — బాహుబలి ఎపిక్ ప్రమోషన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టారట. ఆ సినిమాకు సంబంధించిన కొత్త ఈవెంట్స్, గ్లోబల్ ప్రోమోషన్స్‌లో ఆయన పూర్తిగా లీనమైపోయారన్న టాక్ నెట్టింట వినిపిస్తోంది.దాంతో మహేష్ బాబు అభిమానులు మాత్రం తీవ్రంగా మండిపడుతున్నారు.



"మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సమయంలో ఇలా వేరే పనుల్లో పడటం ఏంటి?", "అంత పెద్ద డైరెక్టర్ అయిన రాజమౌళి ఇలా డిలే చేయడం సరైనదేనా?" అంటూ సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. మరికొందరు అయితే రాజమౌళి బాహుబలి బ్రాండ్ హైప్‌లో పడి, మహేష్ సినిమాపై ఫోకస్ తగ్గించారని ఆరోపిస్తున్నారు.ఇక రాజమౌళి ఫ్యాన్స్ మాత్రం ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. “రాజమౌళి ఎప్పుడూ డెడికేషన్‌తోనే పని చేస్తాడు, ఆయన సినిమాలు లేట్ అయినా ఫలితం గ్రాండ్‌గా ఉంటుంది” అంటూ కౌంటర్ ఇస్తున్నారు.



అయినా సరే, సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ చర్చలతో రాజమౌళి పేరు ట్రోలింగ్ జాబితాలో చేరడం మాత్రం చాలా మందికి షాక్‌గా మారింది. సాధారణంగా రాజమౌళి వంటి మేటి దర్శకుడు ఎప్పుడు ట్రోలింగ్‌కి గురి కావడం అసాధారణం. కానీ ఈసారి పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం – రాజమౌళి ఎంత త్వరగా మహేష్ బాబు సినిమాకి సంబంధించిన ఏదో ఒక చిన్న అప్డేట్‌ అయినా రిలీజ్ చేస్తే, అభిమానుల ఆగ్రహం తగ్గి, హైప్ మరింత పెరిగే అవకాశం ఉంది.ఏదేమైనా… ఈ రాజమౌళి–మహేష్ కాంబినేషన్ సినిమా పట్ల ఉన్న అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అందుకే ఫ్యాన్స్ ఆసక్తి కూడా అంతే ఎక్కువగా ఉంది. ఇక రాజమౌళి ఎప్పుడు ఆ వెయిటింగ్ గేమ్‌కి ముగింపు పలుకుతారో చూడాలి..!

మరింత సమాచారం తెలుసుకోండి: