సినిమా ఇండస్ట్రీ లో ఒకరి దగ్గరికి ఒక సినిమా అవకాశం వచ్చినప్పుడు వారు కొన్ని కారణాలతో ఆ మూవీని రిజెక్ట్ చేయడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఆ బ్యూటీ రిజెక్ట్ చేసిన పాత్రలో మరొకరు నటించడం కూడా సర్వసాధారణంగానే జరుగుతూ ఉంటుంది. ఇకపోతే తెలుగు , తమిళ్ ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్ లో ఒకరిగా అనేక సంవత్సరాల పాటు కెరీర్ను కొనసాగించి ఇప్పటికి కూడా అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్న నటీ మణులలో ఒకరు అయినటువంటి నయనతార గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

ఈమె సినిమాలో తన పాత్రకు ఎక్కువగా ప్రాధాన్యత లేదు అని టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలో హీరోయిన్ పాత్రని రిజెక్ట్ చేసిందట. అసలు విషయం లోకి వెళితే ... పవన్ కళ్యాణ్ కొన్ని సంవత్సరాల క్రితం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన వకీల్ సాబ్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్గా నటించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమా మంచి అంచనాల నడమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీలో శృతి హాసన్ పాత్రకు మొదట నయన తార ను అనుకున్నారట.

అందులో భాగంగా ఆమెను సంప్రదించి ఆ మూవీ కథను మొత్తం కూడా వివరించారట. కానీ నయన తారసినిమా కథ మొత్తం విని ఈ మూవీ లో హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేదు అనే ఆలోచనతో ఈ సినిమాలో హీరోయిన్గా నటించడానికి ఒప్పుకోలేదట. ఆ తర్వాత శృతి హాసన్ ను ఆ పాత్రకు సంప్రదించగా ఆమె మాత్రం ఆ సినిమాలో హీరోయిన్గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఆలా నయనతార రిజెక్ట్ చేసిన మూవీ లో శృతి హాసన్ నటించి మంచి విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: