శ్రీలీల మాట్లాడుతూ—“‘పుష్ప’ సినిమా నా కెరీర్‌పై చాలా పెద్ద ప్రభావం చూపించింది. అలాంటి గ్లోబల్ లెవెల్ ప్రాజెక్టులో భాగం కావడం నాకు గర్వకారణం. ఆ సాంగ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది, ఫ్యాన్స్ లవ్ కూడా దక్కింది. కానీ... అదే సమయంలో నేను ఒక విషయం గ్రహించాను. ఇకపై అలాంటి ఐటమ్ సాంగ్స్ చేయకూడదనుకున్నాను. ఆ సినిమా విషయంలో చేసిన చిన్న తప్పును ఇంకోసారి చేయాలనుకోవడం లేదు. ఇకపై నేను ఎంపిక చేసుకునే ప్రాజెక్టుల్లో కంటెంట్, క్యారెక్టర్‌కి ప్రాధాన్యం ఉండేలా చూసుకుంటాను,” అని చెప్పింది.
తనపై వస్తున్న అభిప్రాయాల గురించి కూడా శ్రీలీల స్పష్టంగా స్పందించింది.“ఇండస్ట్రీలో చాలా మంది నన్ను బెస్ట్ డ్యాన్సర్‌గానే చూస్తున్నారు. కానీ నేను కేవలం డ్యాన్సర్ మాత్రమే కాదు, మంచి నటి కూడా అని గుర్తించాలి. నా పర్ఫార్మెన్స్ చూసినప్పటికీ చాలా మంది ఇంకా ఆ కోణంలో చూడడం లేదు. కానీ నేను ఎవరి అభిప్రాయాల గురించి బాధపడను. నా పని ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడం, కొత్తగా ఏదైనా చూపించడం. అదే నా అసలు ఫోకస్,” అని స్పష్టంచేసింది.ఇక తన భవిష్యత్ ప్రాజెక్టుల గురించి చెబుతూ—“ప్రతి సినిమాలో నేను ప్రేక్షకులకు కొత్తగా అనిపించేలా ఏదో ఒక కొత్త యాంగిల్ చూపించాలని ప్రయత్నిస్తుంటాను. నా ఫ్యాన్స్ నాపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పుడూ నిలబెట్టుకోవాలనేది నా లక్ష్యం,” అని శ్రీలీల చెప్పుకొచ్చింది.తన బ్యూటీ, డ్యాన్స్, టాలెంట్ కలిపి టాలీవుడ్‌లో స్పెషల్ ప్లేస్ సంపాదించిన శ్రీలీల ఇప్పుడు స్క్రిప్ట్ సెలక్షన్‌లో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి