సల్మాన్ ఖాన్ హీరోగా చేసిన భారత్ సినిమా సూపర్ హిట్ టాక్ వచ్చింది. మూడు రోజుల్లోనే వంద కోట్ల రూపాయల క్లబ్ లో చేరిపోయింది. మొదటి నుంచి ఈ సినిమాపై పాజిటివ్ వైబ్ క్రియేట్ కావడం.. సినిమాలో వివిధ సామజిక అంశాలను, వివాదాస్పదమైన అంశాలను చూపించడంతో సినిమా హిట్ కొట్టింది.
వంద కోట్ల క్లబ్ లో చేరిన ఈ సినిమా 200 కోట్ల క్లబ్ లో చేరడం ఈజీ అంటున్నారు. ప్రస్తుతం దీనిపై బెట్టింగ్ కూడా నడుస్తోంది. సల్మాన్, కత్రినా కైఫ్ నటించిన ఈ సినిమాకు బాలీవుడ్ ప్రేక్షకుల మంచి మంచి రెస్పాన్స్ వస్తున్నది. బాలీవుడ్ లో పెద్ద సినిమాలు లేకపోవడం కలిసి వచ్చింది.
ప్రతి ఏడాది ఈద్ ను సల్మాన్ టార్గెట్ చేశాడు. వచ్చే ఏడాది ఈద్ కు ఇన్షాల్లా సినిమాను తీసుకురాబోతున్నారు. దీనిపై కూడా అంచనాలు ఉన్నాయి. మాస్ లో సల్మాన్ కు మంచి పట్టు ఉండటంతో ఇది సాధ్యం అవుతున్నది. వంద కోట్లు అంటే సల్మాన్ కు పెద్ద కష్టం కాదు అన్న సంగతి మరోసారి రూజువైంది.
వంద కోట్ల రూపాయల క్లబ్ లో చేరిన 14 వ సినిమా భారత్. సుల్తాన్ - భజరంగి భాయ్ జాన్ - కిక్ - ప్రేమ్ రతన్ ధన్ పాయో - ఏక్ తా టైగర్ - టైగర్ జిందా హై - దబాంగ్ - దబాంగ్ 2 - బాడీ గార్డ్ - రెడీ - జయహో - రేస్ 3 - ట్యూబ్ లైట్ సినిమాలు అంతకు ముందు ఆ ఫీట్ ను సాధించాయి.