జూనియర్ కుష్బూ అంటూ దక్షిణాది సినిమాలలో దూసుకు బోతున్న హన్సికకు ఇప్పడు మాత్రమే కాదు చిన్నప్పుడు కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉండేదిట. అప్పట్లో ఆమెకు రక్తంతో రాసిన ప్రేమ లేఖలు వచ్చేవని చెప్తోంది. ఈ విషయమై ఆమె మీడియాతో ముచ్చటించింది. హన్సిక చదువుకునే పాఠశాలలో అంతా కోటీశ్వరుల పిల్లలే ఉండే వారట. తను బాలనటిగా ప్రాచుర్యం పొందటంతో ప్రత్యేకంగా చూసేవారట. ఒకరోజు పది మంది అబ్బాయిలు తన స్కూల్ గేట్ వద్ద గంటల తరబడి వేచి ఉండటాన్ని టీచర్ గమనించి కారణం అడిగితే.. హన్సికను చూడాలని సమాధానమిచ్చారట.
వారందరిని ఒకచోట చేర్చి ఆ టీచర్ హన్సిక ను మాట్లాడమని పంపించారట. కాసేపు మాట్లాడి వెళ్తూ వెళ్తూ ప్రేమలేఖలుహన్సిక చేతిలో పెట్టారట. 'ఐ లవ్ యూ హన్సిక' అని రాసి రక్తంతో సంతకం చేశారు. చిన్న వయసులోనే తనకు అంతటి ఫాలోయింగ్ ఉండేది అని చెప్పింది హన్సిక 'సింగం-2'లో స్కూల్ విద్యార్థినిగా నటిస్తున్నారు కదా... సూర్యతో స్కూల్ అనుభవాలు హీరో సూర్య తో పంచుకున్నారా అన్న ప్రశ్నకు సమాధానం చెపుతూ షూటింగ్ లో తన సీన్ పూర్తయిన వెంటనే సూర్య పక్కకు వెళ్లి కూర్చుంటారు అని చెప్పిం ది .
ఇక డ్యూయిట్స్, లవ్ సీన్స్ కే పరిమితమవుతున్నారు. ఒకే తరహా పాత్రలపై మొహం మొత్తలేదా అంటే... నా వయసుకు, రూపానికి ప్రేమపాత్రలే కచ్చితంగా నప్పుతాయని, దర్శకులు కూడా అలాంటి వాటినే ఇస్తున్నారు. ప్రస్తుతం తన వయసు 21 మాత్రమే అనివయసు పెరిగేకొద్దీ, సమయం వచ్చినప్పుడు వైవిధ్య పాత్రలకు కూడా ప్రాముఖ్యత ఇస్తాను అంది. బబ్లీ గర్ల్ హన్సిక ....