ఈ వేసవికి టాలీవుడ్లో కమిట్ అయిన మూడు సినిమాల్లో రిలీజ్‌కు ముందు మూడు సినిమాల విషయానికి వస్తే ఏ సినిమా కమర్షియల్ రేంజ్ తక్కువన్న అంచనాలు, చర్చల్లో అందరూ రామ్‌చరణ్ రంగస్థలం పేరే చెప్పారు. మహేష్ - కొరటాల కాంబినేషన్‌కు ఫస్ట్ ప్లేస్ సహజం. ఇక బన్నీ మార్కెట్‌తో పోలిస్తే చరణ్ మార్కెట్ వీకే. ఇంకా చెప్పాలంటే సుకుమార్ మీద ఎవ్వరూ నమ్మకాలు పెట్టుకోరు. సుకుమార్ ఎప్పుడు ఎలా తీస్తాడో ? అందరికి డౌటే. దీంతో ఈ మూడు సినిమాల్లో ముందు ర్యాంక్ భరత్ అనే నేను, ఆ తర్వాత నా పేరు సూర్య, మూడో ప్లేస్‌లో చరణ్ రంగస్థలం సినిమా కమర్షియల్ రేంజ్ ఉంటుందని అంచనా వేశారు.
ఈ అంచనాలు అన్నీ రంగస్థలం రిలీజ్ అయ్యాక ఒక్కొక్కటి రివర్స్ అయ్యాయి. పూర్తిగా లెక్క తప్పాయి. చరణ్ చివరి సినిమా ధృవ రూ.55 కోట్ల షేర్ రాబట్టింది. సినిమాకు టాక్ బాగున్నా నష్టాలే వచ్చాయి. ఇక రంగస్థలం రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లతో పాటు ఏకంగా ఇప్పటికే రూ.115 కోట్ల షేర్ సాధించేశాడు. షాక్ ఏంటంటే రంగస్థలంకు ముందు వరకు చరణ్ హిట్ సినిమాతో రూ.60 కోట్లు సాధించడం కష్టం అయితే మహేష్, బన్నీ తమ ప్లాప్ సినిమాలతోనే ఆ షేర్ సాధించేవారు.
ఇక రంగస్థలం సినిమాకు మంచి టాక్ వచ్చినా ఆ సినిమా రూ.60 కోట్ల షేర్ రాబడుతుందా ? అని అందరూ ముందుగా సందేహించారు. అయితే ఇప్పుడు అంచనాలు తల్లకిందులూ చేస్తూ ఏకంగా రూ.120 కోట్ల షేర్‌కు దగ్గర అయ్యి అందరి మైండ్లు బ్లాక్ చేసేసింది. ఈ సినిమా తర్వాత వచ్చిన మహేష్ భరత్ సినిమాకు సూపర్ టాక్ వచ్చినా రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినా ఇప్పటకీ రూ.100 కోట్ల షేర్ చేరుకోలేదు. రూ.100 కోట్ల వస్తుందా ? అన్న సందేహాలు కూడా ఉన్నాయి.
ఇండియాలో అలా ఉంచితే మహేష్‌కు కంచుకోట అయిన ఓవర్సీస్లో కూడా రంగస్థలం వసూళ్లను భరత్ క్రాస్ చేస్తుందా ? అన్న సందేహం ఉంది. ఇక ఇలాంటి పరిస్థితుల్లో బన్నీ నా పేరు సూర్య రూ.100 కోట్లు టచ్ చేస్తుందా ? అంటే ఇండస్ట్రీలోనే చాలా మంది చెప్పలేకపోతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే సినిమా కథతో పాటు డైరెక్టర్ మీద ఎవ్వరికి పెద్దగా నమ్మకాలు లేవు. బన్నీ గత సినిమా కంటే కూడా అడ్వాన్స్‌లు తక్కువే వచ్చాయి. ఇక సినిమాలో సీరియస్ కథ కావడంతో కామెడీకి స్కోప్ లేదంటున్నారు. ఇక మీడియాలో ప్రమోషన్లు కూడా తక్కువ గానే ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో బన్నీ ఈ పెద్ద టార్గెట్ ఎలా చేధిస్తాడో ? చూడాలి.