ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమా సూపర్ టాక్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే ప్రీమియర్ కలెక్షన్స్ రూపం లో సరికొత్త రికార్డు ను క్రియేట్ చేసింది. మరో రెండు రోజులు గడిస్తే అన్ని రికార్డ్స్ తుడుచుకు పోతాయని పోతాయని ట్రేడ్ వర్గాల అంచనా.. త్రివిక్రమ్ టేకింగ్‌లో వుండే స్టయిలిష్‌నెస్ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌కి వన్నె తెచ్చింది. ఈ బ్యాక్‌డ్రాప్‌లో చేసే చిత్రాలని ఇంత స్టయిలిష్‌గా ప్రెజెంట్ చేసే వీలుందా అనిపిస్తుంది.
ఫస్ట్ ఫైట్ సీన్‌ని రామ్ లక్ష్మణ్ డిజైన్ చేసిన విధానం అలరిస్తుంది. సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలున్న ఈ చిత్రానికి తెరపై నటీనటవర్గం కూడా కలిసొచ్చింది. ఎన్టీఆర్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. రౌద్ర రసపూరిత పాత్రలు తనకి కొత్త కాకపోయినా మునుపు చూసిన ఎన్టీఆర్‌కి పూర్తి భిన్నంగా ఆ సన్నివేశాల్లో కనిపిస్తాడు. అరుపులు, ఆర్తనాదాలు కాకుండా కేవలం కళ్లల్లో, హావభావాల్లోనే తన రౌద్రాన్ని ప్రదర్శించడం ఈ చిత్రానికి ప్రత్యేకత తెచ్చిపెట్టింది.
స్టాక్ ఫ్యాక్షనిస్ట్ క్యారెక్టర్స్‌కి భిన్నంగా, మంద్ర స్వరంతోనే గాంభీర్యం పలికించడం ఈతరం నటుల్లో తనెందుకు హై రేటెడ్ యాక్టర్ అనేది చూపిస్తుంది. జగపతిబాబు ఆహార్యం, నటన మెప్పిస్తాయి. ఎన్టీఆర్ తర్వాత తెరపై ఈ చిత్రానికి ప్లస్ జగపతి అనడం కాదు అతిశయోక్తి. పూజ హెగ్డే గ్లామరస్‌గా వుంది. సొంత డబ్బింగ్ అప్పుడప్పుడూ ఇబ్బంది పెట్టింది. ఈ పాత్ర చిత్రణ ఇలా జరిగి వుండాల్సింది కాదేమోననే భావన కలుగుతుంది. సునీల్‌కి ఈ తరహా పాత్రలతో డిస్టెన్స్ ఏర్పడినా కానీ కమెడియన్‌గా ఇంకా ఫామ్‌లోనే వున్నాడనేది క్లియర్‌గా తెలిసిపోతుంది. త్రివిక్రమ్ దర్శకుడిగా పూర్తి ఫామ్‌లో లేకపోయినా పలు సందర్భాల్లో తనలోని రైటర్ సాయపడ్డాడు.