తెలుగు బుల్లితెర పై ప్రేక్షకులు విశేషంగా ఆకట్టుకుంటున్న షో 'బిగ్ బాస్'. ముఖ్యంగా ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన 'బిగ్ బాస్ 1' బుల్లి స్క్రీన్ పై ఏ రేంజ్ లో ఉరూతలు ఊగించిందో ప్రత్యేకంగా చెప్పక్కనర్లేదు. అయితే ఎన్టీఆర్ రేంజ్ అంచనాలతో 'బిగ్ బాస్ 2' హోస్ట్ గా వచ్చిన నాని, ప్రేక్షకులను ఆ స్థాయిలో అలరించలేకపోయాడు. ఇక ఈ సారి అక్కినేని నాగార్జున హోస్ట్ గా 'బిగ్ బాస్ 3' మొదలు అయింది. మొత్తం 15 మంది పోటీదారులతో మొదలైన ఈ సీజన్ మొదటి నుంచే కాస్త రసవత్తరంగా ఉండేలా కనిపిస్తోంది.
షోలో పాల్గొన్న కొంతమంది పోటీదారులు ఒకరి మీద ఒకరు అప్పుడే అంతెత్తున లేస్తున్నారు. మెయిన్ గా షోలో ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ యాంకర్ శ్రీముఖి వ్యవహారం పై ఇప్పటికే ఓ అంచనా ఏర్పడుతుంది. అమ్మడికి ఆవేశం కాస్త ఎక్కువే అని నెటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు. రెండో సీజన్లో తేజస్వి ఎంత హడావుడి చేసిందో.. ఇప్పుడు శ్రీముఖి కూడా ఆ రేంజ్ హడావిడి చేసేలా కనిపిస్తోంది.
మరి శ్రీముఖి ఓవర్ యాక్షన్ దెబ్బకి మిగిలిన వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. అయితే ఒకటి మాత్రం స్పష్టంగా అర్ధమవుతుంది. వరుణ్ సందేశ్ దంపతుల మధ్య వ్యవహారం.. అలాగే శ్రీముఖి హాట్ నెస్ ఈ సీజన్ ను గట్టెక్కిస్తాయని నిర్వాహకులు భావిస్తున్నారు. మరి ఏమవుతుందో చూడాలి