మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ రూపొందిస్తున్న చిత్రంలో, మరో యంగ్ హీరో నితిన్ నటిస్తున్నాడా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. తమిళంలో సూపర్ హిట్టైన జిగర్తాండా చిత్రాన్ని తెలుగులో వాల్మీకిగా దర్శకుడు హరీష్ శంకర్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తమిళ మాతృక సినిమాలో లేని హీరోయిన్ పాత్రను వరుణ్ కి జంటగా చేసిన హరీష్... ఇప్పుడు ఈ సినిమా క్రేజ్ ను మరింత పెంచడానికి నితిన్ ను ఈ చిత్రం లో నటింపచేస్తున్నాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి .
వాల్మీకి సినిమాలో నితిన్ నటించేది ఒక సినీ హీరో పాత్ర కావడం, ఆ పాత్ర కు పలువురు పేర్లను పరిశీలించిన దర్శకుడు, చివరకు నితిన్ అయితే బాగుటుందని భావించినట్లు తెలుస్తోంది . వాల్మీకి చిత్రం లో నటించమని హరీష్ అడగడమే తరువాయి నితిన్ ఓకే చెప్పినట్లు సమాచారం . ఇప్పటికే వాల్మీకి సినిమా లోని తన పాత్ర షూటింగ్ కూడా నితిన్ కంప్లీట్ చేసినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి . తమిళంలో ఈ పాత్రను విజయ్ సేతుపతి పోషించగా తెలుగులో నితిన్ నటిస్తున్నాడు. టాలీవుడ్ లో ఇటీవల మల్టీ స్టారర్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాల్ని సాధిస్తున్న విషయం తెల్సిందే .
వరుణ్ తేజ్ , వెంకటేష్ లు కలిసి నటించిన ఎఫ్ 2 చిత్రం భారీ కలెక్షన్లను రాబట్టి ఘన విజయం సాధించింది . ఎఫ్ 2 సినిమా సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ , ఈ సినిమా లో గెస్ట్ రోల్ మరొక యంగ్ హీరో తో వేయించడం చూస్తుంటే , ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించవచ్చునని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి .