ఇక సన్నీ లియోన్ వెబ్ సిరీస్ లో నటించడం ఇది మొదటిసారి కాదు. ఇంతకుముందు సన్నీ'కరంజిత్ కౌర్ ది అన్ టోల్డ్ స్టోరీ అఫ్ సన్నీ లియోన్' అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ సన్నీ నిజ జీవిత కథ తో రూపొందించబడింది. ఓ మధ్య తరగతి అమ్మాయి , పోర్న్ స్టార్ గా ఎందుకు మారాల్సి వచ్చింది. ఆతరువాత పోర్న్ స్టార్ నుండి ఇప్పుడు సక్సెస్ ఫుల్ నటిగా ఎలా కొనసాగుందో ఈ వెబ్ సిరీస్ లో వివరించారు. జీ 5 లో ఈ వెబ్ సిరీస్ ను వీక్షించవచ్చు. కాగా సన్నీ ఇంతకుముందు ఏక్తా కపూర్ నిర్మించిన రాగిణి ఏంఏం ఎస్ 2 అనే చిత్రంలో నటించింది. 2104 లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది.
ఇక ఇప్పుడు కూడా కామసూత్ర వెబ్ సిరీస్ కు సన్నీ అయితేనే న్యాయం చేస్తుందని నమ్మి ఆమెను ఒప్పించిందట ఏక్తా కపూర్. ఈ వెబ్ సిరీస్ ను ఏ ఎల్ టి బాలాజీ యాప్ లో విడుదలచేయనున్నారు. 13 వ శతాబ్దంలో రాజులకు ఉంపుడుగత్తెగా పనిచేసే రాజస్థాన్ లోని గోలీ వర్గానికి చెందిన మహిళల గాథలను ఈ వెబ్ సిరీస్ ద్వారా చూపెట్టనున్నారు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.