నేరాలను అరికట్టేందుకు సభ్య సమాజంలో శాంతి భద్రతలను నెలకొల్పేందుకు పోలీసులు ఎంతలా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అటు నేరాల సంఖ్య మాత్రం రోజురోజుకు పెరిగిపోతుంది అని చెప్పాలి. ఒకప్పుడు ఒక మనిషి ప్రాణం తీయాలి అంటే భయపడి పోయేవారు. కానీ ఇప్పుడు మనిషి ప్రాణం తీయడం అనేది చాక్లెట్ తిన్నంత ఈజీగా మారిపోయింది. చిన్న చిన్న కారణాలకే ఎదుటి వ్యక్తులను దారుణంగా హత మారుస్తున్న ఘటనలు నేటి రోజుల్లో వెలుగులోకి వస్తూ.. ప్రతి ఒక్కరిని కూడా ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి. అయితే ఇలా దారుణమైన హత్యలకు పాల్పడుటమే కాదు ఇక పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరగడంలో కూడా నేరస్తులు సక్సెస్ అవుతున్నారు.



 అయితే సాధారణంగా  నేరస్తులు ఎవరైనా  సరే ఒక హత్యకు పాల్పడిన తర్వాత పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అదే పోలీసులే ఇక కొన్నెళ్ళు గడుస్తున్న హత్య చేసింది తానే అన్న విషయాన్ని గుర్తించకపోతే.. ఇక ఆ నేరస్తుల ఆనందానికి అవధులు కూడా ఉండవు అని చెప్పాలి.  అదృష్టం కలిసి వచ్చింది అని భావిస్తూ ఇక యదేచ్చగా మళ్లీ ఎప్పటిలాగానే జనాల మధ్య తిరగడం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి అలా చేయలేదు. అతను ఒక హత్య చేశాడు. అయితే ఇప్పుడు కాదు దాదాపు 15 ఏళ్ల క్రితం. అప్పటినుంచి ఇప్పటివరకు హత్య కేసులో నిందితుడు అతనే అన్న విషయాన్ని పోలీసులు కనుక్కోలేకపోయారు.


 చివరికి ఈ విషయంపై అతనికి చిరాకు వచ్చేసింది. దీంతో తానే 15 ఏళ్ల క్రితం హత్య చేశాను అన్న విషయాన్ని బయట పెట్టాడు సదరు వ్యక్తి. మెక్సికోలో టోనీ పెరాల్టా అనే యువకుడు ఇలా హత్య చేసిన విషయం బయటపెట్టి సంచలనం సృష్టించాడు. తన ఇంటి యజమాని విలియం బిల్ బ్లడ్ ను 2008లో అకారణంగా హత్య చేసి సాక్ష్యాలు లేకుండా పూడ్చిపెట్టాను. పోలీసులకు కూడా సాక్ష్యాలు లభించకపోవడంతో కేసును సైతం మూసేశారు. అయితే అతన్ని మాత్రం అపరాధ భావన వెంటాడింది.  దీంతో 15 ఏళ్ల తర్వాత పోలీసులకు ఫోన్ చేసి తానే హత్య చేశాను అని ఒప్పుకొని చివరికి స్వయంగా అరెస్టు అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: