తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఒత్తిడికి హైకమాండ్ పెద్దలు దిగొచ్చారు. పార్లమెంట్ సమావేశాల తర్వాత తెలంగాణపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటుకు అంగీకరించారు. త్వరలోనే అఖిలపక్ష సమావేశం తేదీలను ఖరారు చేస్తామని కేంద్ర హోమంత్రి షిండే హామీ ఇచ్చారు. దీంతో టీఎంపీలు ఎఫ్ డీఐలపై జరిగే ఓటింగ్ కు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతకుముందు టీ ఎంపీలు ఎంపీ వివేకే ఇంట్లో భేటీ అయ్యారు. హైకమాండ్ పెద్దలతో అనుసరించాల్సిన వైఖరిపై చర్చించారు. అనంతరం కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిని కలిసి వారి వైఖరి తెలియజేశారు. అయితే హైకమాండ్ సీరియస్ గా ఉందని, ఓటింగ్ కు హాజరు కావాలని, మిగతా విషయాలు తర్వాత చర్చిద్దామని జైపాల్ రెడ్డి సూచించారు. అదే సమయంలో ఆజాద్ కూడా ఎంపీలను ఫోన్ లో సంప్రదించారు. ఎంపీలు మాత్రం తమతో సోనియా మాట్లాడాలని షరతు పెట్టారు. టీ ఎంపీల డిమాండ్ ను ఆజాద్ సోనియా దృష్టికి తీసుకెళ్లారు. దీంతో హైకమాండ్ పెద్దలు హోంమంత్రి షిండేతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటుపై ప్రకటన ఇప్పించినట్టు తెలుస్తోంది. అయితే అఖిలపక్ష సమావేశం ఏర్పాటుపై టీ కాంగ్రెస్ ఎంపీల వైఖరి ఎలా ఉంటుందన్నది మాత్రం ఇంకా స్పష్టం కాలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: