సభ్య సమాజం ఆధునిక పోకడలు తొక్కే కొద్దీ మనుషుల ఆలోచనలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. గతంలో యువకులు అమ్మాయిలకు లవ్ ప్రపోజ్ చేయడం వాళ్లకి ఇష్టం అయితే ఎస్ చెప్పడం, ఇష్టం లేకపోతే నో చెప్పినా ఆ కాలం నాటి అబ్బాయిలు దాన్ని కామన్ గా తీసుకోవడం పరిపాటుగా జరిగేవి. కానీ సభ్య సమాజం ఆధునిక యుగంలోకి అడుగుపెట్టిన తర్వాత ఎవరైనా అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెబితే దానికి ఆ అమ్మాయి ససేమిరా అంటే వెంటనే ఆ అబ్బాయి ఆమ్మాయిపై దాడికి దిగుతున్నారు.