క్షేత్ర‌స్ధాయిలో జ‌రుగుతున్న ప‌రిస్దితులు చూస్తుంటే అవున‌నే అనిపిస్తోంది.  ఉద‌యం జ‌రిగే చివ‌రి క్యాబినెట్ స‌మావేశంలో అసెంబ్లీ ర‌ద్దుకు కెసిఆర్ ఫైన‌ల్ ముద్ర వేయ‌టం దాదాపు ఖాయంగా తెలుస్తోంది. త‌ర్వాత మ‌ధ్యాహ్నం 1 గంట‌కు కెసిఆర్ గ‌వ‌ర్న‌ర్ ఇఎస్ఎల్ న‌ర‌సింహ‌న్ ను క‌లిసి అసెంబ్లీ ర‌ద్దు సిఫార‌సును అంద‌చేస్తార‌ని స‌మాచారం. అస‌లు ఉద‌యం  6. 45 గంట‌ల‌కే గ‌వ్న‌ర్న‌ర్ ను క‌ల‌వాల‌ని అనుకున్నా చివ‌రి నిముషంలో మ‌ధ్యాహ్నానికి మార్చుకున్నారు అందుక‌నే ఉద‌యం 6 గంట‌ల నుండి సాయంత్రం 6 గంట‌ల‌కు మంత్రులంద‌రూ అందుబాటులో ఉండాల‌ని కెసిఆర్ ఆదేశించిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. దాంతో జిల్లాల ప‌ర్య‌ట‌న‌లో ఉన్న మంత్రులంద‌రూ బుధ‌వారం సాయంత్రానికే  రాజ‌ధానికి చేరుకున్నారు.


ఎక్క‌డ చూసినా హ‌డావుడే

Related image

వివిధ వ‌ర్గాల ఓట్ల కోసం కెసిఆర్ ఈమ‌ధ్య పెద్ద ఎత్తున క‌స‌ర‌త్తు చేస్తున్నారు. వివిధ వ‌ర్గాల‌కు వ‌రాలు ప్ర‌క‌టించ‌టం, ఇప్ప‌టికే ఇచ్చిన వ‌రాల‌కు అవ‌స‌ర‌మైన ఉత్త‌ర్వులు జారీ చేయ‌టం, చివ‌రి నిముషంలో బ‌దిలీలు, పోస్టింగులు, పెండింగ్ ఫైళ్ళ క్లియ‌రెన్సులు, శంకుస్ధాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చూస్తుంటే గురువార‌మే శాస‌న‌స‌భ‌కు ఆఖ‌రు రోజని అంద‌రికీ అర్ధ‌మైపోయింది.


మ‌ధ్యాహ్నం గ‌వ‌ర్న‌ర్ తో భేటీ

Image result for kcr and governor

క్యాబినెట్ స‌మావేశం అయిపోగానే తీర్మానం కాపీతో  మ‌ధ్యాహ్నం 1.30 త‌ర్వాత రాజ్ భ‌వ‌న్ కు వెళ్ళ‌టానికి రెడీ అవుతున్నారు. త‌ర్వాత మీడియా స‌మావేశం కూడా నిర్వ‌హించ‌నున్నారు. బుధ‌వారం రాత్రంతా  ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, అసెంబ్లీ స్పీక‌ర్ మ‌దుసూధ‌నాచారి, అసెంబ్లీ  కార్య‌ద‌ర్శి న‌ర‌సింహాచారి త‌దిత‌రుల‌తో వ‌రుస‌బెట్టి స‌మావేశాలు నిర్వ‌హిస్తునే ఉన్నారు. విచిత్ర‌మేమిటంటే  ఇప్ప‌టి వ‌ర‌కూ కెసిఆర్ గ‌వ‌ర్న‌ర్ అపాయింట్మెంట్ తీసుకోలేదు. కాక‌పోతే ఈమ‌ధ్య క‌లిసిన‌పుడు



మరింత సమాచారం తెలుసుకోండి: