ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ భారతీయ రైల్వే సొంతం. ఇప్పుడు  ప్రైవేటీక‌ర‌ణ వైపు అడుగులు వేస్తోంది. రోజూ కోట్లాది మంది ప్రయాణికులను గ‌మ్యాల‌కు చేర్చ‌డ‌మే ల‌క్ష్యంగా... అత్యుత్త‌మ‌ సేవ‌ల‌ను అందించ‌డ‌మే ధ్యేయంగా కేంద్ర ప్ర‌భుత్వం ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న విష‌యం తెలిసిందే. భారతీయ రైల్వే 109 మార్గాల్లో రైళ్లు నడిపేందుకు ప్రైవేటు కంపెనీల నుంచి ‘రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్’(ఆర్ఎఫ్‌క్యూ) ఆహ్వానించింది. 109 మార్గాల్లో 151 ఆధునిక రైళ్ల ద్వారా ప్యాసింజర్ రైళ్లను నడపడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ప్రైవేట్ సంస్థల నుంచి దరఖాస్తులను కోరింది. ఈ ప్రాజెక్టు కింద ప్రైవేటు రంగం నుంచి రైల్వేలోకి రూ.30 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని రైల్వే వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. 2023 మార్చి.. రైల్వే చరిత్రలో విప్లవాత్మక మార్పు అమలు కానుంది. తేజస్‌ లాంటి స్పెషల్‌ కేటగిరీ రైలును ప్రైవేటు సంస్థల ఆధ్వర్యం లో నడిపించనున్నారు. తొలిసారి ప్యాసింజర్‌ రైళ్లు ప్రైవేటు సర్వీసులుగా పట్టాలెక్కబోతున్నాయి.



భారతీయ రైల్వే నెట్‌వర్కులో ఇలా ప్యాసింజర్ రైళ్ల నిర్వహణ కోసం ప్రైవేటు పెట్టుబడులకు ప్రయత్నించడం ఇదే మొద‌టిసారి కావ‌డం విశేషం. గతేడాది ఐఆర్‌సీటీసి మొదటి ప్రైవేట్ రైలు లక్నో- ఢిల్లీ తేజస్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించింది. రైల్వే ప్రకారం, నిర్వహణ వ్యయం తక్కువ చెయ్యడం, భారతీయ రైల్వేలో తక్కువ రవాణా సమయం మరియు ఉద్యోగ అవకాశాలను పెంచడం, మెరుగైన భద్రత మరియు ప్రపంచస్థాయి ప్రయాణ అనుభవంతో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం ఈ చర్య వెనుక ఉద్దేశం. ప్రతి రైలులో కనీసం 16 బోగీలు ఉంటాయి. గరిష్ట వేగం గంటకు 160కి.మీ ఉంటుంది. ఇండియన్ రైల్వే నెట్‌వర్క్‌లో ప్రతి రైలులో కనీసం 16 బోగీలు ఉంటాయి. ఈ మార్గాల్లో నడుస్తున్న అన్ని రైళ్ల గరిష్ట వేగం గంటకు 160 కి.మీ. ఈ ఆధునిక రైళ్లను చాలావరకు ‘మేక్ ఇన్ ఇండియా’ కింద భారతదేశంలో నిర్మిస్తామని రైల్వే తెలిపింది.


ఈ ప్రాజెక్టు ద్వారా రైల్వేలో కొత్త టెక్నాలజీ తీసుకురావడం, మరమ్మతుల ఖర్చు, ప్రయాణ సమయాన్ని తగ్గించడం, ఉద్యోగాలు, భద్రత మరింత పెంచడం, ప్రయాణికులకు అత్యున్నత స్థాయి సౌకర్యాలు కల్పించడమే మా ఉద్దేశ‌మ‌ని  కేంద్ర ప్ర‌భుత్వం చెబుతోంది.  రైల్వే అ నుమతించిన మేర వాటిని పెంచుకుని వసూలు చేసుకుంటాయి.  ప్రస్తుత రైలు చార్జీల కంటే ఎక్కువగా ఉండనున్నాయి. విదేశాల నుంచి కూడా లోకోమోటివ్‌ ఇంజిన్లు, బోగీలు దిగుమతి చేసుకునే వెసులుబాటు కూడా ఉండటంతో కొత్త తరహా రైళ్లు పట్టాలపై పరుగుపెట్టే అవకా శముంది. స్టేషన్లు, సిగ్నళ్లు అన్నీ రైల్వే అధీనంలోనే ఉంటాయి. వాటిని, విద్యుత్తును వినియోగించు కున్నందుకు ఆయా సంస్థలు రైల్వేకు ప్రత్యేక చార్జీలను చెల్లించనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: