ప్రస్తుతం ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా మారిపోయింది.  ఒక మనిషి దేశంలో జీవిస్తున్నాడు అని చెప్పడానికి ఆధార్ కార్డు ఒక ప్రామాణికంగా మారింది. అంతే కాకుండా ప్రతి ఒక్క కార్యకలాపానికి ఆధార్ కార్డు తప్పనిసరి గా మారిపోయింది.  ప్రస్తుతం ఎలాంటి కార్యకలాపాలు చేయాలని ఆధార్ కార్డు సమాచారం అందించాల్సిన వస్తుంది. అయితే నేటి రోజుల్లో ఆధార్ కార్డు ఎంత ప్రామాణికంగా మారిపోయిందో పాన్ కార్డు కూడా అంతే ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రస్తుతం ప్రతి ఆర్థిక కార్యకలాపాలను కూడా పాన్ కార్డు తప్పనిసరిగా మారిపోయింది.



 ఈ క్రమలోనే ప్రతి ఒక్కరు కూడా పాన్ కార్డు పొందేందుకు ముందుకు వస్తున్నారు. అయితే ఒకవేళ మీకు పాన్ కార్డు ఉంటే తప్పనిసరిగా ఈ విషయం తెలుసుకోండి. పాన్ కార్డు ఆధార్ కార్డు తో వెంటనే లింక్ చేసుకోవాలి లేదంటే మాత్రం ఇబ్బందులు పడక తప్పదు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఇప్పటికే పాన్ ఆధార్ కార్డు లింక్ గడువు పొడిగించింది . పాన్ కార్డు ఆధార్ నెంబర్ లింక్ చేసుకోవడానికి గడువు జూన్ 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ఈలోపు ఖచ్చితంగా పాన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు పాన్ కార్డు అనుసంధాన ప్రక్రియను పూర్తి చేయడం ఎంతో మంచిది.



 ఒకవేళ ఆధార్ కార్డు పాన్ కార్డు తో లింక్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే మాత్రం భారీగా జరిమానా తప్పదు అని అర్థమవుతుంది. ఇన్కమ్ టాక్స్ యాక్ట్ 1961 కి సవరణ కూడా చేస్తుంది 234 హెచ్ యాడ్ చేసింది. దీంతో ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ చేసుకోని వారిపై ఇక ఏకంగా వెయ్యి రూపాయల వరకు జరిమానా విధించేందుకు సిద్ధమైంది. 2021 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ రూల్ అమలులోకి వచ్చింది. ఒకవేళ మీరు కూడా పాన్ కార్డు కలిగి ఉంటే వెంటనే మీ పాన్ కార్డుకి ఆధార్ కార్డును అనుసంధానం చేసుకుని జరిమానా నుంచి తప్పించుకోవచ్చు. లేదంటే జేబుకు చిల్లు పడక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: