రోజురోజుకు జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో రఘురామకృష్ణంరాజు ముందుంటున్నారు.  ప్రతిపక్ష పార్టీలైన కాస్త బ్రేక్ తీసుకుంటున్నాయేమో కానీ అటు వైసిపి రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఎప్పుడూ ఏదో ఒక అంశాన్ని తెరమీదికి వచ్చి జగన్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరమైన అమరావతి పై అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ అమరావతి అనే పుస్తకాన్ని ఇటీవలే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో విడుదల చేశారు.



 ఈ క్రమంలోనే అటు జగన్ ప్రభుత్వంపై కూడా పలు విమర్శలు గుప్పించారు రఘురామకృష్ణంరాజు. ఏపీ ఆర్థిక శాఖ మంత్రి ఎక్కువ సమయం పాటు ఢిల్లీలోనే ఉంటున్నారు..  అయితే జగన్ ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు నియమించనున్నట్లు గానే అయిదుగురు ఆర్థిక శాఖ మంత్రి కూడా నియమించుకొని ఉంటే బాగుండేది అంటూ ఎద్దేవా చేశారు రఘురామకృష్ణంరాజు. ఇక విశాఖ ను రాజధానిగా చేస్తామని ప్రకటించిన నాటి నుంచి విశాఖలో ఇక వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. కనిపించిన ఆస్తులన్నింటినీ కబ్జాలు చేస్తున్నారు. బీచ్ రోడ్ లోని అనేక ఆస్తులను నయానా భయానా ద్వారా స్వాధీనం చేసుకుంటున్నారు. దీంతో విశాఖ ప్రజలందరిలో భయభ్రాంతులు పెరిగిపోతున్నాయి అంటూ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు.



 వరల్డ్ బెస్ట్ ఎంప్లాయిస్ అవార్డును అందుకున్న అమర్ రాజా కంపెనీ ఇక ఏపీ ని వదిలి వెళ్ళి పోతూ ఉండటం పై కూడా స్పందించారు రఘురామకృష్ణంరాజు. ఏపీలో ఉన్న పొలిటికల్ పొల్యూషన్ కారణంగానే అమర రాజా కంపెనీ వెళ్ళిపోతుంది అంటూ వ్యాఖ్యానించారు. ఇదంతా సీఎం జగన్ కక్షపూరితంగానే చేస్తున్నారు అంటూ విమర్శలు గుప్పించారు. తమిళనాడులో ఉన్న తన పరిశ్రమకు కూడా ఇలాగే ఇబ్బందులు కల్పించారు అంటూ చెప్పుకొచ్చారు. జగన్ తీసుకొస్తున్న స్కీమ్స్ గురించి అటవీ పర్యావరణ శాఖ అధికారి విజయకుమార్ మాట్లాడటం ఏంటి అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారులు విచ్చలవిడిగా రాజకీయాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. దేశంలో లభించే ఏ బ్రాండ్ ఏపీలో ఉండదని.. ఇక ఏపీ లో ఉండే ఏ బ్రాండ్ కూడా దేశంలో ఉండదు అంటూ ఎద్దేవా చేశారు రామకృష్ణంరాజు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rrr