
ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన కాస్తో కూస్తో కలిసి పనిచేసిన సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత అసలు ఏమాత్రం కూడా మీడియాలో కూడా కనపడే ప్రయత్నం చేయడం లేదు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి కనీసం పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరు కాకపోవడం పట్ల చాలా వరకు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు కీలక నేతగా ఉన్న జానారెడ్డి ఇప్పుడు నియోజకవర్గంలో కూడా పెద్దగా తిరిగే ప్రయత్నం చేయటం లేదు.
జానారెడ్డి కుమారులు కూడా పెద్దగా నియోజకవర్గంలో కష్టపడక పోవడంతో పార్టీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోంది.ఇక ఆ రేవంత్ రెడ్డి పాదయాత్ర కు సంబంధించి చాలా వరకు కూడా ఇప్పుడు పార్టీ సీనియర్ నేతలు వద్దని చెబుతున్నారని రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తే కచ్చితంగా ఈ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయని కాబట్టి పాదయాత్ర కాకుండా మరో కార్యక్రమాన్ని తీసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. మరి భవిష్యత్ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో ఏవిధంగా మారబోతున్నాయి అనేది చూడాలి.