పుష్ప 2 సినిమా తో సూపర్ హిట్ నుఖాతాలో వేసుకున్న  సుకుమార్ .. ఆ తర్వాత రామ్ చరణ్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు .. మధ్యలో ‘పెద్ది’  ఉంది కాబట్టి సుకుమార్ కు కావాల్సినంత సమయం దొరికింది .. ఈ క్రమంలో తన శిష్యుల లైఫ్ ను సెటిల్ చేసే పనిలోపడ్డాడు ఈ దర్శకుడు .. సుకుమార్ దగ్గర శిష్యులుగా పని చేసిన దాదాపు అర‌డ‌జ‌ను  దర్శకులకు సుకుమార్ రైటింగ్స్ ద్వారా మంచి అవకాశాలు ఇవ్వడానికి ఈ క్రేజీ దర్శకుడు రెడీ అవుతున్నాడు .. ప్రస్తుతం వీళ్ళ కథ‌లు విని మార్పులు చేర్పులు చేసి హీరోలను సెట్ చేసి సినిమాలను పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు ఈ లెక్కల మాస్టర్ ..
 

ఇక ఈ మధ్యకాలంలో సుకుమార్ దాదాపు 100 కథలు వినడని కూడా తెలుస్తుంది .. ఇవన్నీ తన శిష్యుల కథ‌లే .  ప్రతిరోజు కొన్ని కదులు వినడం వాటిని ఫైనల్  చేయటం అనేది సుకుమా డైలీ రొటీన్ గా మారిపోయింది .. ఇక వీటిలో కనీసం ఆరు కథలు ఓకే చేసి ఆరుగురు కొత్త దర్శకులని టాలీవుడ్‌కు పరిచయం చేయాలని భావిస్తున్నాడు సుకుమార్ .. అలాగే ఓ ఓటిటి సంస్థతో సుకుమార్ భాగస్వామిగా మారుతాడని పెట్టుబడి అంతా ఆ ఓటీటీ సంస్థ చూసుకుంటుందని క్రియేటివ్ హెడ్ గా సుకుమార్ పనిచేస్తారని టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాల టాక్ ..

 

ఇక సుకుమార్ శిష్యులుగా వచ్చిన వాళ్ళు  ప్ర‌స్తుతం టాలీవుడ్ లో చాలామంది దర్శకులుగా సెటిల్ అయిపోయారు .  బుచ్చిబాబు రామ్ చరణ్ తో భారీ సినిమా చేస్తున్నాడు .. ఆ సినిమా కథ లోను సుకుమార్ ఆలోచనలు గట్టిగా ఉన్నాయి .. ఇప్పుడు బుచ్చిబాబు లాంటి మరింత కొత్త దర్శకులను సుకుమార్ రైటింగ్స్ తయారు చేస్తున్నారు .  తన శిష్యుల కెరియర్ గురించి ఇంతగా ఆలోచించే ఇలాంటి దర్శకుడు దొరకటం నిజంగా వారి అదృష్టమే ..

మరింత సమాచారం తెలుసుకోండి: