
ముఖ్యంగా తిరుమలకు సొంత కార్లలో వచ్చే భక్తులు కచ్చితంగా వీటిని పాటించాలంటూ తిరుమల తిరుపతి దేవస్థానం తో పాటుగా తిరుపతి జిల్లా ఎస్పీ కూడా తెలియజేస్తున్నారు.వేసవికాలం కారణం చేత తిరుపతికి వస్తున్న రెండు కార్లు తగ్గమయ్యాయి. ఏమంటే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు అయితే రెండు కార్లు కూడా పూర్తిగా కాలిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఈ కార్లు అలా దగ్ధం అవ్వడానికి గల కారణాలు ఏంటా అని నిపునులను సంప్రదించగా వారు కొన్ని కారణాలు చెప్పారట. అందుకే ఇలా సొంత వాహనాలలో వచ్చేటువంటి భక్తులు కొన్ని నియమాలను పాటించాలని తెలుపుతున్నారు.
కార్లలో మంటలు రావడానికి ముఖ్య కారణం.. దూర ప్రయాణం చేయడం.. 500 కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత ఇంజన్ వేడిగా ఉంటుంది ఆ ఒత్తిడిని తట్టుకోలేక దగ్ధమవుతున్నాయట.. అంతేకాకుండా తిరుమల ఘాటు ఎక్కడ ప్రారంభిస్తే ఇంజన్ మరింత వేడి ఎక్కుతుందని తెలిపారు.
తిరుమల కొండ ఎక్కడానికి ఇంజన్ కు మరింత శక్తి అవసరం డ్రైవర్లు ఎక్కువగా తరచూ గేర్లను ఉపయోగిస్తారు. దీని వల్ల ఇంజన్ వేడి పెరుగుతుంది. అలాగే దిగే సమయంలో కూడా ఎక్కువగా బ్రేకులు టచ్ చేయడం వల్ల బ్రేక్ సిస్టం కూడా వేడిగా మారుతుందట.
అధిక బరువు కలిగి ఉన్న వాటిని కారులో తీసుకురావడం వల్ల ఒత్తిడి ఎక్కువ అవుతుందట.
వాహనాల మెయింటైన్ సరిగ్గా లేకపోవడం, అలాగే సర్వీసింగ్ సరిగ్గా చేయించకపోవడం ,కూలెంట్ ఆయిల్ లీక్ అవడం, పాడైన రేడియేటర్లు, పాడైపోయిన ఇంజన్ ఆయిల్ వంటివి ఉంచడం వల్ల మంటలు చెలరేగుతున్నాయని నిపుణులు తెలిపారట.
1). తిరుపతికి బయలుదేరేముందు బండి సర్వీసింగ్ చేయించాలి.
2).రేడియేటర్ లీక్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. అలాగే ఫ్యాన్ బెల్ట్ కూడా చెక్ చేసుకోవాలి. ఇంజన్ ఆయిల్, కూలెంట్ ఆయిల్, బ్రేక్ ఆయిల్ ఇలా అన్నిటిని చెక్ చేసుకోవాలి.
3). డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదు.. డ్రైవర్ డ్రైవింగ్ చేస్తున్న ప్రతి రెండు గంటలకు ఒకసారి కారుని ఐదు నిమిషాల పాటు ఆపడం మంచిది.
4). ఘాట్ రోడ్డు ఎక్కే ముందు కనీసం 30 నిమిషాలకు ముందు వాహనాన్ని ఆపివేయడం మంచిది.
5). వెహికల్ డాష్ బోర్డు ముందు ఏవైనా రెడ్ లైట్ కనపడుతున్నాయా లేదా వాటిని చూస్తూ ఉండాలి.
6).ముఖ్యంగా బ్యాటరీని చెక్ చేసుకోవడం మంచిది అలాగే వైర్లను కూడా తరచూ చెక్ చేస్తూ ఉండాలి.
ఇలాంటివన్నీ చెక్ చేసుకుని మరి తిరుపతికి కొండమీదికి ఎక్కాలి అంటే తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ తెలియజేస్తున్నారు.