జగనన్న మోడీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత సైన్యానికి సర్వాధికారాలు ఇచ్చే విధంగానే ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే ఒకవైపు సైన్యం లోని కమాండర్ స్థాయి అధికారులు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని కూడా కల్పించారు. అదే సమయం లో శత్రువులను ఎంతో సమర్థవంతం గా ఎదుర్కొనేందుకు సరిహద్దుల్లో సైనికులు అందరికీ కూడా మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యం గా ప్రస్తుతం భారత ప్రభుత్వం ముందుకు సాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఒకవైపు అధునాతన టెక్నాలజీతో కూడా ఆయుధాలు కొనుగోలు చేసి భారత అమ్ముల పొదిలో చేర్చుతుంది.


 ఇలా ఓ వైపు భారత ఆర్మీ ని ఎంతో పటిష్టం గా మారుస్తూనే మరోవైపు సమర్థవంతం గా సైనికులందరూ పోరాడే విధం గా సరిహద్దుల్లో మౌలిక వసతులు కల్పిస్తూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే సరిహద్దుల్లో సైనికులు కోసం రైలు రోడ్డు మార్గాలు ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. తద్వారా శత్రువులతో అటు సైనికులు ఎంతో సమర్థవంతంగా యుద్ధం చేసే వెసులు బాటు వచ్చింది అని చెప్పాలి. అయితే యుద్ధం సమయంలో శత్రు దేశాలపై దాడులు చేసిన సమయంలో ఆకాశం నుంచి కూడా శరవేగంగా దాడులు జరిగే అవకాశం ఉంది.



 ఈ క్రమంలోనే  శత్రుదేశాల దాడులను ఎంతో సమర్ధవంతంగా తిప్పికొట్టేందుకునీటి అంతర్భాగం నుంచి కూడా దాడి చేసే విధంగా కొత్త ఆవిష్కరణ ఏర్పాటు చేసేందుకు ప్రస్తుతం భారత ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల బ్రహ్మపుత్రా నది అడుగున ఒక మెగా టన్నెల్ నిర్మించడానికి సంబంధించినటువంటి ప్రక్రియకు భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఇది నేరుగా చైనా పై దాడి చేసే విధంగా ఉంటుందట. ఇక ఒకవేళ ఇది సక్సెస్ అయింది అంటే చాలు భారత రక్షణ రంగంలో సరికొత్త అధ్యాయానికి తెర లేచినట్లు అవుతుందని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: