రష్యా ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం మొదలై మూడు రోజులకు దగ్గర పడుతోంది. రోజు రోజుకీ పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి తప్ప, ఏ మాత్రం యుద్ధం ఆగే సూచనలు కనబడడం లేదు. ఒకానొక దశలో ఉక్రెయిన్ అధ్యక్షుడు సైతం సైనికుడిగా మారి యుద్ధం చేసిన వైనం మనము చూశాము. ఇంత జరుగుతున్నా, రెండు దేశాలలో ప్రజలు యుద్ధం వద్దని గగ్గోలు పెడుతున్నా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఏ మాత్రం వినిపించుకోకుండా ఒక నియంతలా ప్రవర్తిస్తున్నాడు. ఇది ప్రపంచంలోని దేశాలు అందరినీ ఎంతగానో ఆగ్రహానికి గురి చేస్తోంది. అయితే నిన్న ఇండియాలోని రష్యా ఎంబసీ వద్ద జరిగిన ఆందోళనల కారణంగా భారత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఉక్రెయిన్ లో చిక్కుకు పోయిన భారతీయ పౌరులను స్వదేశానికి పంపించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఉక్రెయిన్ లో ఉన్న భారతీయ విద్యార్థులను ముందస్తుగా సరిహద్దు దేశాలు అయిన రొమేనియా మరియు హంగరీ లకు పంపించారు. అక్కడ నుండి ఇండియాకు పంపాలని ప్లాన్ చేశారు. అనుకున్న విధంగానే ఇప్పుడు అక్కడ నుండి డైరెక్ట్ గా ఇండియా కు రానున్నారు. ఈ తరలింపు కోసం ఇండియా రెండు ప్రత్యేక  ఎయిర్ ఇండియా విమానాలను ఏర్పాటు చేసింది. ఈ రెండు ఎయిర్ ఇండియా విమానాల్లో 470 మంది వరకు వస్తున్నారు.  అందులో భాగంగా రొమేనియా రాజధాని అయిన బుకారెస్ట్ నుండి ఢిల్లీ మరియు ముంబై నగరాలకు ఆ రెండు విమానాలు బయలు దేరినట్లు సమాచారం అందుతోంది.
 
ఇప్పటికే ఒక ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ కి సురక్షితంగా చేరుకుంది. కాగా మిగిలిన ఇంకొక ఎయిర్ ఇండియా విమానంలో మధ్యాహ్నం ముంబై కు చేరుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి అలా ఉక్రెయిన్ నుండి వచ్చిన ఆయా రాష్ట్రాల విద్యార్థులను ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా వారి ఇంటికి పంపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: