ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నిన్న మొన్నటి వరకూ జీతాలు పెరగలేదని, పీఆర్సీతో ఇబ్బందులు పడుతున్నామని, సీపీఎస్ రద్దు చేయలేదని కంప్లయింట్ చేసిన ఉద్యోగుల్లో చాలామంది ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో సంబరపడిపోతున్నారు. ప్రభుత్వానికి, సీఎం జగన్ కి కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన సందర్భం వచ్చింది.

ఉద్యోగులన్నాక జీతాల పెంపు, ప్రమోషన్లు కామన్. కానీ ప్రమోషన్ల విషయంలో ఆయా పోస్టుల్లో సీనియర్లకు ఓ పట్టాన పనికాదు. తమ ముందున్నవారికి ప్రమోషన్లు వస్తేనే, కిందివారికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఏపీలో జిల్లాల విభజన వారికి అనుకోని వరంలా మారింది. జిల్లాల విభజనతో కొత్త పోస్టులు తెరపైకి వచ్చాయి. దీంతో ఆయా పోస్టుల్లోకి సీనియర్లను తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. అంటే అనుకోకుండా సీనియర్లకు ప్రమోషన్లు వరంలా మారాయి. దీనిపై ఇప్పటికే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్లారిటీ ఇచ్చారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత జిల్లా, డివిజన్ స్థాయిలో అదనంగా అవసరమయ్యే వివిధ పోస్ట్ లను పదోన్నతుల ద్వారనే భర్తీ చేస్తామని స్పష్టం చేశారు మంత్రి పెద్దిరెడ్డి. అర్హత ఉండి ప్రమోషన్లకోసం వేచి చూస్తున్నవారందరికీ న్యాయం చేస్తామన్నారాయన. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పలు పథకాల అమలు తీరుపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయన పదోన్నతులపై గుడ్ న్యూస్ చెప్పారు.

జోనల్ పరిధి దాటితే రాష్ట్రపతి ఆమోదం అవసరమేనా..?
జిల్లాలు, జోనల్ పరిధి దాటి ప్రమోషన్లు, నియామకాలు అంటే అది స్థానిక రిజర్వేషన్లపై ఉన్న నియమాలను అధిగమించినట్టు అవుతుంది. అందుకోసం దీనికి రాష్ట్రపతి అనుమతి తప్పనిసరి అని కొంతమంది తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమయినా.. కొత్త జిల్లాల కారణంగా కొత్త ఉద్యోగ అవకాశాలు పుట్టుకొస్తాయనేది వాస్తవం. అదే సమయంలో కొత్త జిల్లాల్లో కొత్తగా ఏర్పాటయ్యే శాఖల్లో పదోన్నతులు కూడా జరగాల్సి ఉంటుంది. దీనికోసం ఇప్పుడు చాలామంది వేచి చూస్తున్నారు. ఇలా ప్రమోషన్లకోసం వేచి చూస్తున్నవారంతా మంత్రి పెద్దిరెడ్డి మాటలతో ఊరట చెందారు.

మరింత సమాచారం తెలుసుకోండి: