ప్రస్తుతం ఏపి రాజకీయాల్లో జనసేన పార్టీ హుషారు జోరుగా కనపడుతోంది. అలాగే ప్రజా అభిమానం కొరకు వారి పిలుపు గట్టిగా వినపడుతోంది. గత ఎన్నికలతో పోలిస్తే ఇపుడు జనసేన పార్టీ ఏపిలో కీలకంగా మారింది. కొత్త రంగులను, హంగులను దిద్దుకుని బలమైన ప్రత్యర్ధి పార్టీగా మారింది. ఇపుడు ఆంధ్రలో అందరి చూపు రానున్న ఎన్నికలపై పడింది. రూలింగ్ పార్టీ నే కాదు, ఇతర ప్రత్యర్ధి పార్టీలు కూడా వేటికవే సరికొత్త ప్రణాళికలతో ప్రజల్లోకి వెళుతున్నాయి. ఎలాగైనా ఈ సారి ఎన్నికల్లో ఆధిపత్యం సాధించాలని కసిగా ఉన్నాయి. జనసేన పార్టీ కూడా తన సత్తా చాటుతూ ఎన్నికలకు రంగం సిద్దం చేస్తోంది.

ఇప్పటికే తన అన్న నాగబాబును బరిలోకి దింపారు జనసేన అధినేత పవన్. ఉత్తరాంధ్ర ప్రాంతం బాధ్యతలను అన్నగారు నాగబాబు చేతిలో పెట్టారు.   అయితే 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం రెండు ప్రాంతాల నుండి పోటీ చేశారు. కానీ విజయాన్ని సాధించలేకపోయారు. గట్టి పోటీ ఇచ్చి రెండవ స్థానంలో నిలిచారు. అయితే ఈసారి ఎక్కడి నుండి పోటీ చేయబోతున్న అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  కాగా రాబోయే ఎన్నికల్లో పవన్  ఎక్కడ నుండి పోటీ చేయనున్నారు ? అనే దానిపై పలు ఊహగానాలు జోరుగా వినపడుతున్నాయి.  గాజువాక, భీమవరం, తాడేపల్లిగూడెం, కాకినాడ, తిరుపతి ఈ అయిదు స్థానాల్లో ఎక్కడ నుండి పోటీ చేయనున్నారు అనే విషయంపై ఇప్పటి వరకు అధికారిక సమాచారం అనేది జనసేన సమాచారం అందలేదు కానీ తిరుపతి అని తెలుస్తోంది.  

అయితే ఇపుడు  రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది. పవన్ కి తిరుపతి అయితే అన్ని విధాలుగా కలిసి వస్తుందనే భావన కనపడుతోంది. కాగా ప్రస్తుతం తిరుపతికి సంబంధించి గ్రౌండ్ రిపోర్టు ను రెడీ చేస్తోందట జనసేన. అందుతున్న సమాచారం మేరకు అక్కడ అయితే అత్యదిక  మెజారిటీ లభిస్తుందని అంటున్నారట. లక్ష మెజారిటీ వరకు  వస్తుందని సమాచారం. మరీ రాజకీయాలలో ఎప్పుడు ఎటువంటి సంచలనం జరుగుతుందో ఊహించలేము.  


మరింత సమాచారం తెలుసుకోండి: