ఇపుడిదే అంశం టీఆరఎస్ సర్కిళ్ళల్లో బాగా చర్చ జరుగుతోంది. అధికారపార్టీకి చెందిన 12 మంది ఎంఎల్ఏలు తొందరలోనే టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరబోతున్నట్లు ప్రచారం పెరిగిపోతోంది. ఇప్పటికే ఆ 12మందితో బీజేపీ సీనియర్ నేతలు ఒకసారి సమావేశం కూడా నిర్వహించేశారట. రెండో సమావేశం ఎప్పుడన్నది తెలీదు. మొదటిసమావేశంలో పార్టిసిపేట్ చేసిన 12 మంది ఎంఎల్ఏలు ఎవరు, వీళ్ళతో సమావేశమైన కమలనాదులు ఎవరు అన్న విషయం సస్పెన్సుగా మారింది.





చాలారోజులుగా టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలపై బీజేపీ కన్నుపడిండని అందరికీ తెలిసిందే. రెండుపార్టీల్లోని నేతల్లో ఎంతమందిని వీలైతే అంతమందిని పార్టీలోకి లాగేసుకోవాలని బీజేపీ శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. ఇంతలోనే అధికారపార్టీకి చెందిన 12 మంది ఎంఎల్ఏలతో బీజేపీ నేతలు సమావేశమయ్యారనేది పెద్ద వార్తే. సరే టీఆర్ఎస్ లో చాలామంది మంత్రులు, ఎంఎల్ఏలపైన జనాల్లో విపరీతంగా వ్యతిరేకత పెరిగిపోతోంది.





ఒకవేళ ఆ 12 మంది టీఆర్ఎస్ ను వదిలేసి బీజేపీలో చేరినా వాళ్ళేమీ రాజీనామాలు చేసేదిలేదు ఉపఎన్నికలు వచ్చేదీలేదు. ఎందుకంటే టీఆర్ఎస్ లోకి వచ్చిన ఎంఎల్ఏల్లో ఎవరూ రాజీనామాలు చేయలేదు. రాజీనామా చేయటంలో ఈటల రాజేందర్ కు మాత్రమే మినహాయింపు. సరే ఇదే సమయంలో 12 మంది ఎంఎల్ఏలు పార్టీమారితే కేసీయార్ ఏమిచేస్తారు ? ఏదో విషయమై వాళ్ళపైన కేసులు పెడతారేమో.  తన ప్రభుత్వాన్ని రద్దుచేసుకుని మధ్యంతర ఎన్నికలకు వెళతారనే ప్రచారం కూడా పెరిగిపోతోంది. అయితే ఇక్కడే కేసీయార్లో టెన్షన్ పెరిగిపోతోంది. ప్రభుత్వాన్ని రద్దుచేసుకోవటం వరకే తనిష్టం. ఎన్నికలు ఎప్పుడు పెట్టాలనేది కేంద్ర ఎన్నికల కమీషన్ ఇష్టం.






ఎన్నికల కమీషన్ అంటే కేంద్రప్రభుత్వం లేదా బీజేపీ అనే చెప్పాలి. తాను ప్రభుత్వాన్ని రద్దుచేసుకోగానే కమీషన్ ఎన్నికలు పెట్టకపోతే అప్పుడేం చేయాలి ? ప్రభుత్వం లేక, ఎన్నికలూ జరగకపోతే రాష్ట్రపతి పాలనే ఉంటుంది. అంటే పరోక్షంగా బీజేపీదే పెత్తనం. మరపుడు వాళ్ళని కేసీయార్ తట్టుకోగలరా ?  ఈ విషయంలోనే కేసీయార్లో టెన్షన్ పెరిగిపోతోందట. మరి ఏమి చేస్తారో చూడాల్సిందే.




మరింత సమాచారం తెలుసుకోండి: