రాజకీయాల్లో సహనం చాలా అవసరం అని అంటారు. ఎందుకంటే అది కోల్పోతే వచ్చే అనర్ధాలు అన్నీ ఇన్నీ కావు. దాని వల్ల మాట తీరుతో  బాటు బాడీ లాంగ్వేజ్ కూడా మారిపోతుంది. అపుడు అన్నీ గటగటా బయటకు వచ్చేస్తాయి. ఇలాంటి పరిస్థితి రాకుండానే నేతలు ఆచీ తూచీ మాట్లాడుతూంటారు.


వైస్రాయ్ కుట్ర:


ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు జనాలు మరచిపోలేని కుట్ర అది. డెబ్బై మూడేళ్ళ ముదిమి వయసులో, అనారోగ్యంతో ఉన్న అన్న గారిని వంచించి, ముఖ్యమంత్రి పదవిని, ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ పదవిని కూడా లాగేసుకున్న వెన్ను పోటు అది. దానికి అందంగా ప్రజాస్వామ్య పరి రక్షణ అని పేరు పెట్టుకుని ఉడొచ్చు కాక. కానీ అసలు విషయం మాత్రం అదేనని అందరికీ తెలిసిందే. ఇక, వైస్రాయ్ కుట్రలో భాగస్వాములెవరూ అన్నది కూడా లోకానికి వెల్లడి అయిన సంగతే, తాజాగా కేసీయార్, చంద్రబాబుల మధ్య మాటల యుధ్ధంతో ఆ కుట్ర సిధ్ధాంతకర్తలు కూడా బయటకు వస్తున్నారు. మామను మోసం చేసి పదవి గుంజుకున్నావు అంటూ కేసీయార్ బాబుని విమర్శిస్తే ఆ కుట్రలో నీవే కదా సిధ్ధాంతకర్తవి అంటూ  చంద్రబాబు ఎదురుదాడి చేశారు. 


ఇక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాదు కానీ మొత్తానికి తెలుగు జాతికి మణి దీపంలా ఉన్న అన్న గారిని వంచించడంలో అంతా ఒకటయ్యారని చెప్పకనే చెప్పుకున్నారు. అంతే కాదు. మత్రి పదవి నీవు పొందలేదా అని చంద్రబాబు అంటే, అన్న గారి అల్లుడివి కాబట్టే ముఖ్యమంత్రి పదవి మీకు ఇచ్చారంటూ టీయారెస్ నేత  తలసాని శ్రీనివాస్ అంటున్నారు. మొత్తానికి పదవీ లాలసతోనే అన్న గారి పదవిని లాగేసుకున్నారని కూడా ఈ  తిట్ల ఎపిసోడ్లో ప్రూవ్ అయిపోయింది.   మొత్తానికిఅన్నగారినే దైవంగా కొలిచే అఖిలాంధ్రులు  నిజాలు బయటపడడంతో బాబు గారి పార్టీ పట్ల ఎన్నికల వేళ జనం ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక మహానాయకుడు మూవీలో ఇవన్ని పెడతారా అన్నది  కూడా గమనించాలి.


విభజన డిమాండ్ :


ఇక తెలంగాణాకు వెళ్ళినపుడల్ల రాష్ట్రాన్ని విడదీయామని నెనే చెప్పానని క్రెడిట్ కోసం చెప్పుకునే చంద్రబాబు కేసీయర్ పుణ్యమాని సహనం కోల్పోయి విభజన డిమాండ్ నాదేనని గట్టిగా ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డునే  అనడం ఈ మొత్తం తిట్ల పురాణంలో హైలెట్. అంటే ఉమ్మడి ఏపీని ముక్కలు చేశారు కాంగ్రెస్ వారు అంటూ ఇన్నాళ్ళూ ఏపీలో చెప్పుకొస్తున్న చంద్రబాబు ఇపుడు అసలు గుట్టు విప్పేశారన్నమాట. విభజన జరిగి నాలుగున్నరేళ్ళ కాలంలో ఏ మాత్రం అభివ్రుధ్ధి చేందని ఏపీ మళ్ళీ ఎన్నికలకు వెళ్ళబోతోంది. ప్రత్యేక హోదా డ్రామాలు ఒకవైపు అయితే, ఇపుడు విభజన పుణ్యం కూడా నాదేనని చెప్పుకుంటున్న టీడీపీ అధినేతకు జనం ఎలా ఎలాంటి తీర్పు ఇస్తారో కూడా చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: