రేపటి ఎన్నికల్లో ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్నది ఉత్కంఠను రేపుతోంది. ఇప్పటికే పలు జాతీయ సర్వేలు దీనిపై తమ అభిప్రాయాన్ని తెలియచేయగా తాజాగా వచ్చిన మరో సర్వే ఏపీలో  నిశ్శబ్ద విప్లవం ఉన్నట్లుగా అంచనా కట్టింది. అదే కనుక జరిగితే మాత్రం దేశ రాజకీయాల్లోనే మరో సంచలనమైన రికార్డ్ ప్రజా తీర్పు ద్వారా నమోదు అయ్యే అవకాశాలు పక్కాగా ఉంటాయి.


ఏకంగా 23 సీట్లు :


ఏపీలో వైసీపీకి మొత్తం 25 పార్లమెంట్ సీట్లకు గాను 23 సీట్లు దక్కుతాయని టైమ్స్‌ నౌ– వీఎంఆర్‌ సర్వే వెల్లడించింది. టీడీపీ కేవలం రెండు సీట్లకు మాత్రమే పరిమితమవుతుందని, జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లు ఖాతా తెరవలేవని చెప్పింది. వైఎస్సార్‌ సీపీ, టీడీపీల మధ్య ఓట్ల వత్యాసం కూడా భారీగానే ఉంటుందని సర్వే పేర్కొంది. వైఎస్సార్‌సీపీకి 49.5 శాతం ఓట్లు, టీడీపీకి 36 శాతం, బీజేపీ (ఎన్‌డీఏ)కి 4.8 శాతం, కాంగ్రెస్‌ (యూపీఏ)కు 2.5 శాతం ఓట్లు పడతాయని వెల్లడించింది.


వైసీపీ ప్రభంజనమే :


ఈ ఫలితాల‌ను బట్టి బేరీజు వేసుకుంటే ఏపీలో భారీ ప్రభంజనమే వీచే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే మొత్తం ఏపీ జనాలు ఏకపక్షంగా వైసీపీకి పట్టం కడతారని కూడా తేలుతోంది. ఎంపీ సీట్లు 23 అంటే వాటిని అసెంబ్లీ సీట్లుగా మార్చుకుంటే 154కు పైగా సీట్లు వైసీపీకి దక్కుతాయని తేలుతోంది. ఆ విధంగా చూసుకుంటే అప్పట్లో అన్న నందమూరి, ఈ మధ్యన డిల్లీలో ఆప్ పార్టీలు రాసిన చరిత్రను వైసీపీ తిరగరాస్తుందనుకోవాలి. కేవలం రెండు సీట్లు మాత్రమే టీడీపీకి ఇచ్చారు
అంటే అసెంబ్లీలో ఆ పార్టీకి 14 మాత్రమే వస్తాయని చెబుతున్నట్లైంది. ఇదే నిజంగా జరిగితే ప్రతిపక్ష ష్తానాఇకి కూడా ఆ పార్టీ అర్హత సాధించలేదన్నది ఈ సర్వే పక్కాగా చెబుతున్నట్లుంది. మిగిలిన పార్టీలన్నీ 5 సీట్లకే పరిమితం అవుతాయని సర్వే అంచనా వేసినట్లుంది. అంటే ఏపీలో ఇపుడు నిశ్శబ్ద విప్లవం ఉందా అన్నది ఈ సర్వేను బట్టి చూస్తే అర్ధమవుతూంది. మరి చూడాలి అసలు తీర్పు ఎలా ఉంటుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: