దివంగత వంగవీటి రంగా తర్వాత రాష్ట్రంలోని కాపు సామాజికవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నేత వంగవీటి రాధా....రంగా తనయుడుగా కాంగ్రెస్ పార్టీలో పోలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రాధా....ఆ తర్వాత ప్రజారాజ్యంలో చేరారు. ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో కలిపేయడంతో ఆయన వైసీపీలో చేరారు. ఇక అక్కడ ఇమడలేక చివరికి టీడీపీలోకి వచ్చారు. అయితే ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఆయన జగన్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ...తన తండ్రి చావుకి టీడీపీ కారణం కాదంటూ మీడియా ముందుకు వచ్చి చెప్పారు.

Image result for vangaveeti radha

కానీ వైసీపీకి రాజీనామా చేసిన ఆయన్ని టీడీపీ నేతలు పార్టీలోకి ఆహ్వానించాయి. అయితే ఆయన వెంటనే పార్టీలో చేరకుండా ఉన్నారు. ఇక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేయడంతో ఆయన తాజాగా టీడీపీలో చేరారు.   అయితే రాధా టీడీపీలో చేరితే ఎమ్మెల్సీ పదవి ఇద్దామని అనుకున్నారు. కానీ అప్పటికి ఆయన పార్టీలో చేరకపోయేసరికి అవి ఇతరులకి వెళ్లిపోయాయి. అలాగే రాధా ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. మరి పోటీ చేస్తే గెలుస్తామో లేదో అన్న అనుమానమో ఉన్నట్లుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆయన్ని ఎంపీగా పోటీ చేయించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.


దీనిలో భాగంగానే ఆయన్ని మచిలీపట్నం నుంచి లోక్‌సభ బరిలో దించాలని చూస్తున్నారని ఒకసారి... అనకాపల్లి లేదా నరసాపురం నుండి పోటీ చేయిస్తారని మరోసారి వార్తలు వచ్చాయి.  అయితే అవి బాబు పెట్టె ప్రపోజల్స్ తప్ప..రాధా కావాలని అడిగినట్లు కనిపించడం లేదు. అసలు రాధాకి ఎక్కడ పోటీ చేయడం ఇష్టం లేనట్లుగా తెలుస్తోంది. ఎన్నికల బరిలో దిగకుండా సైలెంట్‌ ఉంటేనే బెటర్‌గా ఉంటుందని అనుకుంటున్నట్లున్నారు. తర్వాత పార్టీ పరంగా ఏదొక పదవి దక్కుతుందిలే అని చూస్తున్నట్లున్నారు. అసలు ఈ పరిణామాలన్నీ చూస్తుంటే వంగవీటి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడినట్లుగా కనిపిస్తోంది. మరి రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: