ఏపీలో పోలింగ్ ఘట్టం ముగిసింది. ఎవరి లెక్కలు వారు తీసే పనిలో పడ్డారు. ఎక్కడ గెలుపునకు అవకాశాలు ఉంటాయన్న దాని మీద ఇపుడు మధింపు జరుగుతోంది. భారీ ఎత్తున జరిగిన పోలింగ్ ఎవరికి షాక్ ఇవ్వనుంది అన్నది పెద్ద ఎత్తున చర్చగా  ఉంది.

 


కాగా పోలింగ్ ముగిసిన వెంటనే వైసీపీ అధినేత జగన్ మీడియా ముందుకు వచ్చి తమ గెలుపు ఖాయామని ధీమాగా చెప్పారు. అంతే కాదు. ఏకపక్షంగా జనం తమ పార్టీకి ఓట్లేశారని కూడా ఆయన వివరించారు. జనాలు పెద్ద ఎత్తున తరలిరావడం బట్టి చూస్తూంటే వచ్చేది వైసీపీ సర్కారేనని కూడా జగన్ గట్టిగా చెప్పారు.

 


ఇక టీడీపీ వైపు నుంచి ఇంతే ధీమాతో చెప్పే వారు లేకపోవడం విశేషం. చంద్రబాబునాయుడు మీడియా ముందుకు రాలేదు. ఉదయం నుంచి నానా హడావుడి చేసిన తమ్ముళ్ళు సాయంత్రానికి చల్ల బడ్డారు. పోలింగ్ సరళి ఏమైనా తేడా కొడుతోందా అన్న అనుమానాలు టీడీపీ శిబిరంలో ఉన్నాయని అంటున్నారు. అయితే అన్ని ఆశలు పించన్లు, పసుపు కుంకుమ ఓట్ల మీదనే టీడీపీ పెట్టుకుంది. ఏది ఏమైనా భారీ పోలింగ్ మాత్రం అధికారంలో ఉన్న పార్టీకి షాక్ లాంటిదేనని విశ్లేషకులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: