రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో ఎలక్ర్టికల్‌ బస్సులు ప్రవేశపెట్టాలని నూతన ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఎలక్ర్టికల్‌ బస్సులు అనగానే హై ఎండ్‌ శ్రేణి బస్సులతోనే ఆర్టీసీ అధికార యంత్రాంగం ముడిపెడుతోంది! హై ఎండ్‌ శ్రేణితో ముడిపెట్టడం వల్ల బడ్జెట్‌ బండెడు అవుతోంది. రాజధాని ప్రాంతంలో విజ యవాడ, అమరావతి నగరాలను ఎలక్ర్టికల్‌ బస్సులు నడపాలని పైలట్‌గా ప్రభుత్వం నిర్ణ యించింది.

 

రాష్ట్రవ్యాప్తంగా 350 ఎలక్ర్టికల్‌ బస్సుల వరకు తొలిదశలో ప్రవేశపెట్టాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. రాజధాని ప్రాంతం కాబట్టి వీటిలో గణనీయమైన సంఖ్యలోనే విజయవాడ, అమరావతిలకు కేటాయించే అవకాశం ఉంది. ఇంతవరకు బాగానే ఉంది. ఎలక్ర్టిక్‌ బస్సులను కొనుగోలు చేసే విషయంలో ఆర్టీసీ అధికారులు అను సరిస్తున్న తీరు ఆక్షేపణీయంగా ఉంటుంది.

 

ఎలక్ర్టికల్‌ బస్సులను హై ఎండ్‌ శ్రేణిలోనే నడపాలన్నట్టు అంచనాలను సూచించటం విమర్శలకు తావిస్తోంది. ఎలక్ర్టికల్‌ బస్సు అంటే భారీ బడ్జెట్‌తో కూడుకున్నదన్న భ్రమను ఆర్టీసీ అధికార యంత్రాంగం ప్రభుత్వానికి కల్పిస్తోంది. రమారమీ హై ఎండ్‌ శ్రేణిలో ఎలక్ర్టికల్‌ బస్సు రూ.3 కోట్ల వరకు ఖరీదు చేస్తోంది.

 

ఇందులో కేంద్ర వాటా పోను, మిగిలినది రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. వందల సంఖ్యలో ఎలక్ర్టికల్‌ బస్సులు కొనుగోలు చేయాలనుకున్నప్పుడు ఇది ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వానికి భారమేనని చెప్పాలి. ఎలక్ర్టికల్‌ బస్సులకు ప్రాతిపదిక ఏమిటన్నది ఆర్టీసీ అధికార యంత్రాంగం ఆలోచించకపోవటం విమర్శలకు తావిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: