దేశంలో మునుపెన్నడూ నమోదుకానంత వర్షపాతం నమోదైంది. ఇప్పటికీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా బీహార్‌లో కొన్ని ప్రాంతాలు వర్షం నీటిలోనే ఉన్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో కురిసిన వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. నిలువ నీడను కోల్పోయి అస్తవ్యస్తంగా మారిన పరిస్థితులతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీసే పరిస్థితి వచ్చింది. ఈసారి నమోదైన వర్షపాతం దాదాపు 25 ఏళ్ల వర్షపాతంతో సమానంగా చెబుతున్నారు వాతావరణ అధికారులు.

ఉపరితల ఆవర్తన ప్రభా ,వం వల్ల బుధవారం కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, తెలంగాణ, యానాం, మధ్య మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఢిల్లీలోని కేంద్ర వాతావరణశాఖ విడుదల చేసిన తాజా బులిటిన్ లో హెచ్చరించింది. దీంతోపాటు ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ ప్రాంతాల్లో బుధవారం అతి భారీవర్షాలు కురుస్తాయని వాతావరణకేంద్రం అధికారులు వెల్లడించారు.ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతోపాటు పిడుగులు పడవచ్చని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

తెలంగాణ, ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు, అనేక ప్రాంతాల్లో తేలికపాటి జల్లులతో కూడిన వర్షాలకు అవకాశాలున్నట్టు అధికారులు తెలిపారు. విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం, హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్ర అధికారులు తాజా పరిస్థితులపై ఓ ప్రకటన విడుదల చేశారు. మధ్య ఒడిషా ప్రాంతంలో ఉరితల ఆవర్తనం కొనసాగుతుందని, అలాగే దక్షిణ ఛత్తీస్‌గడ్ నుంచి కోస్తా కర్ణాటక వరకు తెలంగాణ, మధ్య కర్ణాటకల మీదుగా 1.5 కి.మీ ల ఎత్తులో మరో ఉపరిత ధ్రోణి కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. దీనికారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వారు పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: