2019 ఎన్నికల్లో భారీ మెజారిటీని  సొంతం చేసుకుని  అధికారాన్ని చేపట్టింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష టీడీపీ పై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతూనే ఉంది. జనసేన టిడిపి పార్టీలపై ఎన్ని విమర్శలు చేసినప్పటికీ... బీజేపీ పార్టీ పై అంతగా విమర్శలు చేయలేదు జగన్ సర్కార్. అంతేకాకుండా మొదటినుంచి కేంద్రంలో బీజేపీ పెద్దలతో సానుకూలంగానే ఉంటూ వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఇదిలా ఉంటే తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి... ఢిల్లీ  వరుస పర్యటనలు ప్రస్తుతం దేశ రాజకీయాలతో పాటు ఆంధ్ర రాజకీయాల్లో  కూడా సంచలనంగా మారాయి. 

 


 మొన్నటికి మొన్న ఢిల్లీ వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి... ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఇక ఆ తర్వాత నిన్న మరోసారి హస్తినకు వెళ్ళి హోం శాఖ మంత్రి అమిత్ షా తో భేటీ  కావడం... నిన్న రాత్రి అక్కడే గడిపి ఈరోజు మధ్యాహ్నం పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై చర్చలు జరపడం ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో  సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరుస  ఢిల్లీ పర్యటన వెనుక అంతర్యం ఏమిటి అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు అని కొంతమంది అంటుంటే... లేదు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి జగన్  ఢిల్లీకి వెళ్లారు అంటూ మరి కొంతమంది అంటున్నారు. 

 

 ఇకపోతే సీఎం జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఎన్డీయేలో  కి వైసీపీ చేరబోతున్నదని...  ఈ విషయంపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లారు అంటూ ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా తాజాగా మరో ప్రచారం కూడా తెరమీదికి వచ్చింది. వైసీపీ పార్టీకి రెండు కేంద్ర మంత్రి పదవులు దక్కే అవకాశం  ఉన్నది  అని... అంతేకాకుండా ఒక సహాయ మంత్రి పదవి కూడా దక్కబోతుంది  అంటూ చర్చ జరుగుతోంది. అయితే వైసీపీ లోని కీలక నేత అయినా ఎంపీ విజయసాయిరెడ్డి నౌకాయాన శాఖ అప్పగిస్తారని ప్రచారం కూడా ప్రస్తుతం ఊపందుకుంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నేత అనురాధ కు కేంద్ర సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నారు అని ప్రచారం జరుగుతోంది. మరి ఎంతవరకు నిజం అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: