కరోనా వైరస్ (కోవిడ్ 19) కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3 వేలు దాటింది. కరోనా వైరస్‌తో మృతి చెందిన వారి సంఖ్య అమెరికాలో మూడు దాటినట్లు సమాచారం.  . సింగపూర్‌లో ఉంటున్న జపాన్, మియన్మార్, ఫిలిప్పైన్స్ దేశాలకు చెందిన నలుగురికి కోవిడ్ సోకింది. ఇప్పటి వరకు మనుషలపైనే పంజా విసిరిన కరోనా వైరస్... ఇప్పుడు జంతువులను కూడా టార్గెట్ చేస్తోంది. హాంకాంగ్ లో ఓ పెంపుడు కుక్కకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది.  కరోనా తో ప్రపంచం మొత్తం వణికి పోతుంది.  చైనాలో మొదలైన ఈ మహమ్మారి ప్రపంచం అంతా వ్యాపిస్తుంది. కాగా, కరోనా ఇప్పటి వరకూ మొత్తం 64 దేశాలకు వైరస్ విస్తరించిందని, ఈ దేశాల్లో 8,774 మందికి వైరస్ పాజిటివ్ వచ్చిందని తన నివేదికలో తెలిపింది. రోజురోజుకూ వైరస్ విస్తరిస్తోందని, ఇది చాలా ఆందోళనకరమైన పరిస్థితని అభిప్రాయపడింది.

 

ఇక తెలంగాణలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు కరోనా సోకినట్లు నిర్ధారణ కావడం, మరికొందరు కొవిడ్‌ లక్షణాలతో సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి క్యూకట్టడం, ఏపీలోనూ అక్కడక్కడా బాధితులు ఉన్నారని ప్రచారం జరుగుతుండటంతో... తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా వైరస్‌ గురించే చర్చ జరుగుతోంది.  మార్చి 4వ తేదీ వ‌ర‌కు దేశవ్యాప్తంగా మొత్తం 29 క‌రోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. మరోవైపు ప్రతి రోజూ కరోనా పరిస్థితిపై సమీక్షలు నిర్వహిస్తున్నామని.. దీనిపై మంత్రుల బృందం ఎప్పటిక‌ప్పుడు పర్యవేక్షణ చేస్తుందన్నారు.  తాజాగా హాంకాంగ్ లో ఓ పెంపుడు కుక్కకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. మనిషి నుంచి జంతువుకు కరోనా వైరస్ సోకిన తొలి కేసుగా ఇది ప్రపంచ రికార్డుపుటల్లోకి ఎక్కింది.

 

ఈ కుక్కను 60 ఏళ్ల మహిళ పెంచుకుంటోంది. ఆమె ద్వారా కుక్కకు కరోనా సోకిందట.  దాన్ని జంతువుల క్వారంటైన్ కు పంపించారు. గత శుక్రవారం నుంచి దానికి క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో దానికి బలహీన స్థాయిలో కరోనా వైరస్ ఉందని రిపోర్ట్ వస్తోంది. ఈ రెండు కుక్కలలో ఒక దానికి కరోనా నెగెటివ్ అని తేలింది. దానికి మరోసారి పరీక్ష నిర్వహించి, మళ్లీ నెగెటివ్ అని తేలితే ఐసొలేషన్ నుంచి విడుదల చేయనున్నారు. మరో కుక్క గురించి వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: