ఈ భూభాగం మాది.. మా భూ భాగంలోకి మీరు చొచ్చుకు వచ్చారు.. మా సైన్యంపై దాడులు చేస్తున్నారు.. అంటూ తెగ మాట్లాడుతున్నారు డ్రాగన్లు.  కానీ భారత సైన్యం మాత్రం మేం న్యాయంగా ఉన్నామని.. మా గడ్డపై ఎవరు కాలు మోపినా ఊరుకునేది లేదని గట్టిగానే చెబుతున్నారు.  ఇలా గాల్వాన్ లోయలో భాతర్ - చైనాల మంద్య యుద్ద మేఘాలు కమ్ముకుంటున్నాయి.  జూన్ 15న రాత్రి గాల్వాన్ లోయలో హింసాయుత సంఘటన చోటుచేసుకోడానికి ముందు తూర్పు లదాఖ్‌తో పాటు సిక్కిం ప్రాంతాల్లో రెండు వైపుల సైన్యాలు పలు చోట్ల కొట్లాటకు దిగాయి.  అయితే దీనికి సంబంధించిన కొన్ని వ్యూజువల్స్ బయటకు వచ్చాయి. ఇందులో డ్రాగన్స్ దాష్టికం స్పష్టంగా వీడియలో కనిపిస్తుంది.

IHG's the uproar?

గొడవ జరిగిన ప్రాంతంలో భారీగా మంచు ఉండటం, అక్కడి కొండలను బట్టి అది సిక్కిం సరిహద్దు అయి ఉండొచ్చని తెలుస్తోంది. రెండు వైపులా జవాన్లు మాస్కులు ధరించి ఉండటాన్ని బట్టి  ఫూటేజ్ లో కనిపిన్నాయి... ఇటీవల చిత్రీకరించిందేనని సమాచారం. ఈ వీడియో ప్రస్తుతం కొన్ని మీడియా ఛానెళ్లలో ప్రసారం అయింది. వీడియోలో.. ‘ఇక్కణ్నుంచి వెళ్లిపోండి.. మీరు బోర్డర్ దాటి వచ్చారు..’ అంటూ ఓ భారత జవాన్ మర్యాదపూర్వకంగా హెచ్చరించాడు.  అటువైపు చైనా ఆర్మీకి చెందిన ఇద్దరు ఆఫీసర్లు, ఐదారుగురు సైనికులు ఉన్నారు.

IHG't ignore it anymore.

మనవాళ్లు దాదాపు అంతే మంది ఉన్నారు. సదరు ఆఫీసర్లు మనవాళ్లతో వాదానికి దిగారు.   భారత సైనికుడు ఇది మా భూమి.. మీరు అడుగు పెట్టొద్దు అని హెచ్చరించాడు.. దాంతో రెచ్చిపోయిన డ్రాగన్ సైనికుడు  గట్టిగా అరుస్తూ దూసుకురాగా మనవాళ్లు అతన్ని నిలువరిస్తూ కొట్టారు. ఆ వెంటనే ఇరు పక్షాల సైనికులు గుంపుగా చేరి పిడిగుద్దులు విసురుకున్నారు. దాదాపు ఐదున్నర నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. తూర్పు లదాఖ్‌లోని గల్వాన్ లోయ, పాంగాంగ్ సరస్సు, హాట్ స్ప్రింగ్స్ ప్రాంతాల్లో కబ్జాకు యత్నించిన డ్రాగన్ బలగాలను మనవాళ్లు తిప్పికొట్టారు. గతవారం గల్వాన్ లోయలో ఘర్షణలో మనవైపు 20 మంది జవాన్లు చనిపోగా, 76 మంది గాయపడటం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: