ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని.. ఆయన మాట ముక్కుసూటి గా ఉంటుంది. చెప్పాలనుకున్న మాట నిర్మొహమాటం గా చెప్పేస్తారు. మంచి మనసున్న వ్యక్తి. సాయం కోరిన వారికి సాధ్యమైనంత వరకు చేసేవరకు విశ్రమించరు. విజయవాడ లో పదేళ్ల నుండి లోకల్ ఛానల్ లో పని చేస్తున్న కెమెరామెన్ సురేష్ గత ఏడాది అనారోగ్యం తో మరణించాడు. ఆయనకు భార్య, ఏడాది వయసున్న కుమారుడు ఉన్నాడు.

 

 

సొంత ఇల్లు లేదు. భార్య మల్లీశ్వరి దివ్యంగురాలు. ఎంబీఏ చదువుకున్నా చేసేందుకు ఉద్యోగం లేక కుటుంబపోషణ భారంగా మారింది.. మీడియా లో పనిచేసిన సురేశ్ కుటుంబానికి ప్రభుత్వం నుండి ఏమైనా సహాయం అందుతుందేమోనని జర్నలిస్ట్ ల ద్వారా ఆమె 8 నెలలు ప్రయత్నం చేసింది. ఎలాంటి ఫలితం రాలేదు. ఇంతలోనే కరోనా లాక్ డౌన్ తో జీవనం కష్టతరమైంది. చివరి ప్రయత్నం గా ఆమె ఓ సీనియర్ జర్నలిస్ట్ కి తన దీన స్థితి వివరించింది.

 

 

స్పందించిన ఆ సీనియర్ జర్నలిస్టు వెంటనే వినతిపత్రం తయారుచేశారు. బాధితురాలిని నేరుగా సమాచారశాఖ మంత్రి పేర్ని నాని వద్దకు తీసుకెళ్లి జర్నలిస్ట్ సురేష్ మరణం తర్వాత కుటుంబం ఎదుర్కొంటున్న కష్టాలు వివరించారు. మంత్రి వెంటనే.. లక్ష నుండి 2 లక్షలు సహాయం వచ్చేలా చేస్తానన్నారు. అంతే కాదు ఎంబీఏ చదివిన సురేష్ భార్య మల్లీశ్వరికి కాంటాక్ట్ పద్ధతి లో ఉద్యోగం ఇచ్చేలా కలెక్టర్ తో మాట్లాడతనని చెప్పారు.

 

 

సరిగ్గా నెల తిరిగేలోగా మంత్రి కార్యాలయం నుండి మల్లీశ్వరికి ఫోన్ చేసి 2 లక్షల చెక్ వచ్చింది. మీ ఇంటికి వచ్చి ఇస్తామన్నారు. చెప్పినట్లే మంత్రి కార్యాలయం నుండి వచ్చిన ప్రతినిధులు మల్లీశ్వరి కి సాయం అందచేశారు. ఇంటికొచ్చి చెక్ ఇవ్వడం తో సాయం పొందిన జర్నలిస్ట్ సురేష్ భార్య మంత్రి గారికి రెండుచేతులు జోడించి కృతజ్ఞతలు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: