'శ్రీ పవన్ కళ్యాణ్, ఫైనల్ నూతన విద్యా విధానాన్ని రూపొందించేటప్పుడు బహుముఖ విద్య గురించి మీ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారు. 2020 నూతన విద్యా విధానం కింద... విద్యార్థులు తమ ఇష్టమైన చదువును, జీవిత ప్రణాళికలను రూపొందించుకోడానికి వీలుగా తనకిష్టమైన ఏ సబ్జెక్ట్ అయినా ఎంపిక చేసుకోవచ్చు', అంటూ పవన్ కళ్యాణ్ విద్యా విధానంపై ఇచ్చిన సూచనలకు సంబంధించిన ఒక వీడియో ని పోస్ట్ చేసారు డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్.
ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... 'నేను చదువుకుంటున్న రోజుల్లో... కేవలం పుస్తక పఠనం మాత్రమే కాకుండా పెయింటింగ్ వంటి కళలను నేర్చుకోవాలి అనుకున్నాను. మా పాఠశాలలో పెయింటింగ్ నేర్పించే ఒక వర్క్ షాప్ ఉంటే బాగుండేదని ఎంతో తపన పడ్డాను. ఒక విద్యార్థి ఏదైనా కళ నేర్చుకోవాలంటే అది అతనికి నేర్పించగలిగే విధంగా భారతీయ పాఠశాలలు ఉండాలి' అని పవన్ కళ్యాణ్ సూచించారు.
వాస్తవానికి అప్పుడెప్పుడో కొఠారి కమిషన్ భారత దేశ విద్యా విధానంలో మార్పులు చేసింది. ఆ రోజు నుండి మొన్నటి వరకు భారత దేశ విద్యా విధాన రూపకర్తలుగా కొనసాగిన వారందరూ మన విద్యా విధానంలో ఎటువంటి హర్షించదగ్గ మార్పులు చేయలేకపోయారు. చివరికి కస్తూరి రంగన్ కూడా భారతీయ విద్యా విధానం ఇలా సరికొత్తగా, అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలి అని ఒక ఆలోచన చేయలేక పోయారు. చివరికి మన తెలుగు వ్యక్తి పవన్ కళ్యాణ్ నూతన విద్యా విధానం కొరకు ఇచ్చిన సలహాలను పరిగణలోకి తీసుకొని అతను చెప్పినట్టుగానే విద్యా విధానాన్ని రూపొందించారు. మోడీ ప్రభుత్వం కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆధునిక ఆలోచనలు ఎంతో మందికి ఉపయోగపడతాయని గుర్తించింది.
పవన్ కళ్యాణ్ గొప్ప ఆలోచన విధానాన్ని మోడీ ప్రభుత్వం గుర్తించింది కానీ సామాన్య ప్రజలు మాత్రం అతడిని ఒక ఇంటర్ ఫెయిల్ అయిన వ్యక్తిగానే పరిగణిస్తున్నారు. రెండు లక్షల రూపాయల విలువైన పుస్తకాలను చదివిన పవన్ కళ్యాణ్ అపారమైన విజ్ఞానాన్ని సాధించారని... ప్రతి పుస్తకంలోని సారాన్ని తేనెటీగ మకరందాన్ని సేకరించినట్టు సేకరించిన విజ్ఞానఖని అని.. అతని ఆలోచన ధోరణి గొప్ప గా ఉంటుంది... అతని ఆలోచనా విధానానికి ఎవరైనా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందేనని... కానీ అతని ప్రతిభను ఎవరూ కూడా గుర్తించలేకపోతున్నారు అని ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వెక్కిరింపులు, అపార్థాలు మానుకొని అపారమైన జ్ఞాన సంపద కలిగిన పవన్ కళ్యాణ్ సొసైటీ మంచి కోసం రోజున 24 గంటలూ మదన పడుతున్నారని అర్థం చేసుకోవాలని చాలామంది ప్రముఖులు సామాన్య ప్రజలను కోరుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి