ఈ సమావేశానికి ఇంటలిజెన్స్ చీఫ్ ఎలా వెళ్లారని అనుమానం వ్యక్తం చేశారు. వీరిద్దరూ కలిసి వెళ్లడంపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని వర్ల చెప్పుకొచ్చారు. ఇవే కాకుండా ఈ సమావేశంపై వర్ల రామయ్య అనేక ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా విషయంపై చర్చించేందుకు గవర్నర్ దగ్గరకు సీఎం లేదా మంత్రులు వెళ్లాలి కానీ, రాజ్యసభ సభ్యుడు ఇంటెలిజెన్స్ చీఫ్, ఈ ఇద్దరు కలిసి వెళ్లడంపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు.
ఈ విమర్శలపై వైసిపి పెద్దగా స్పందించలేదు. అయితే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాత్రం విజయసాయిరెడ్డి తో భేటీకి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.కానీ అందులో మరే వివరాలు ప్రస్తావించలేదు. కాగా.. విజయసాయిరెడ్డి ఇంటలిజెన్స్ చీఫ్ రాజేంద్రనాథ్ రెడ్డి ఏ విషయంపై గవర్నర్ తో భేటీ అయ్యారు అనే అంశంపై క్లారిటీ లేకపోవడంతో, రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలు, సందేహాలకు తావిస్తోంది.దీనిపై అధికారికంగా వైసీపీ ప్రకటన విడుదల చేసే వరకు ఈ భేటీకి సంబందించిన ఉత్కంఠ కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి