పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం రాజకీయాలు వాడివేడిగా మారిపోయాయి. ఈ క్రమంలోనే ఇక ఐదు విడతలుగా పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరుగుతుంది. అయితే ఇప్పటికే మూడు విడుదలకు సంబంధించిన పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయినప్పటి నుంచి ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి అన్ని పార్టీలు. ఈ క్రమంలోనే రోజురోజుకు పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరింత హాట్ హాట్ గా మారిపోయాయి. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతుంది అని చెప్పాలి.  ఇప్పుడు వరకు అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్ర అభివృద్ధికి చేసింది ఏమీ లేదు అంటూ బీజేపీ విమర్శలు చేస్తూ ఉంటే... బయట వ్యక్తులకు అధికారం కట్టబెడితే రాష్ట్రం నాశనం అవుతుంది అంటూ అటు మమత సరికొత్త ప్లాన్ తో ప్రజలను ఆకట్టుకుంటోంది.



 రోజురోజుకు పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారిపోతున్నాయి. బీజేపీ భారీగా ప్రచారం నిర్వహిస్తూ ఉండటం ఢిల్లీ పెద్దలు అందరూ కూడా రంగంలోకి దిగి పశ్చిమబెంగాల్ లో పోటీ చేస్తున్న అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించి ఓటర్ల ఆకట్టుకోవడం జరుగుతుంది. అయితేమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ ఏ బహిరంగ సభలో మాట్లాడిన బయట వ్యక్తులు బెంగాల్ లో వచ్చి పాలన సాగించాలని ప్రయత్నిస్తే రాష్ట్ర ప్రజలు ఊరుకోరు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే తాజాగా దీనిపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు.



 ప్రధాని నరేంద్ర మోడీని తనను తిట్టడం తప్ప పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వేరే పని అంటూ ఏదీ లేదు అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్ లోని హరి రాంపూర్ లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న అమిత్ షా ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీ పదేపదే తనను బయటి వ్యక్తి అంటూ వ్యాఖ్యానిస్తున్నారని.. అక్రమ వలసదారులే బయట వ్యక్తులు అవుతారని..  కానీ తాను భారత్లోనే పుట్టాను భారత్లోనే చేస్తాను తన అంత్యక్రియలు కూడా ఇక్కడే జరుగుతాయి అంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు. ఇక ఈ సందర్భంగా అందరూ బిజెపికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. బీజేపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అవుతుంది అంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: