యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొత్త అస్త్రాన్ని ప్రయోగిస్తుంది. మహిళా ఓటర్లే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ఇంచార్జ్ గా ఉన్న ప్రియాంక గాంధీ మహిళల ఓట్లు సాధించేందుకు అనేక హామీలు ఇస్తున్నారు. యూపీ కంచు కోటను తిరిగి సాధించుకునే లక్ష్యంలో భాగంగా మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ప్రియాంక గాంధీ ప్రయత్నిస్తున్నారు. మహిళలకు 40శాతం టికెట్లను కేటాయించనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా 2022 అసెంబ్లీ ఎన్నికల్లో  తమ పార్టీ అధికారంలోకి వస్తే 12వ తరగతి అమ్మాయి లకు స్మార్ట్ ఫోన్లు, గ్రాడ్యుయేట్లకు ఎలక్ట్రానిక్ స్కూటీ లనుఅందిస్తామని ప్రకటించారు. ఇక మహిళలకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం తో పాటు, యువతులకు ఆఫర్స్ ప్రకటిస్తూ  వారి ఓట్లను సాధించే ప్రయత్నం చేస్తున్నారు.

403 అసెంబ్లీ సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ 160 మంది మహిళా అభ్యర్థుల్ని బరిలో దించునుంది. మొత్తం 14 కోట్లకు పైగా ఓటర్లు ఉండగా మహిళా ఓటర్లు ఆరున్నర కోట్లకుపైగా ఉన్నారు. 2017 ఎన్నికల్లో పురుషుల ఓటింగ్ 59% అయితే మహిళ ఓటింగ్ 63% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అప్పుడు 46 శాతం మంది మహిళలు బిజెపికి ఓటు వేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బిజెపి అనేక పథకాలను ప్రచారం చేస్తుంది. ఉచిత గ్యాస్ సిలిండర్లు, టాయ్ లెట్ల నిర్మాణం, త్రిపుల్ తలాక్ అంశాలను  కమలనాదులు  తమ ప్రచార అస్త్రాలుగా మార్చుకున్నారు. వీటికి దీటుగా ప్రియాంక గాంధీ  40 శాతం టికెట్లు ఇతర హామీలను ఇస్తున్నారు. మామూలుగా యూపీ అంటేనే కులాల కుంపట్లు. అలాంటి చోట కులాలకు అతీతంగా  మహిళా ఓటర్లను సంఘటితం చేసేందుకు ప్రియాంక వ్యూహం రూపొందించారు.

మరి ఈ ప్రయోగం కాంగ్రెస్ కు ఎంతవరకు సబ్ ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. గతంలో మమతా బెనర్జీ, జయలలిత, నితీష్ కుమార్, నవీన్ పట్నాయక్ వివిధ పథకాలతో మహిళా ఓటర్లను ఆకర్షించి విజయం సాధించారు. ఇప్పుడు వారి దారిలోనే  పయనిస్తున్నారు ప్రియాంక గాంధీ . యూపీలో 1989 నుండి అధికారానికి దూరంగా ఉంది కాంగ్రెస్. 32 ఏళ్ల తర్వాత  తిరిగి తన పట్టు సాధించాలని కోరుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: