హుజూరాబాద్ ఉపఎన్నిక కోసం సీఎం కేసీఆర్ అనేక ఎత్తులు వేశారు. ఎలాగైనా తనపై తిరుగుబాటుకు యత్నించిన ఈటల రాజేందర్‌కు తగిన గుణపాఠం చెప్పాలని కేసీఆర్ తన శాయశక్తులా యత్నించారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. కేసీఆరే స్వయంగా రంగంలోకి దిగినంతగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయినా సరే ఈ ఎన్నికలో ఈటల రాజేందరే గెలిస్తే.. అది కేసీఆర్‌కు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పుకోవాలి. ఈటల రాజేందర్ ఏమాత్రం మంచి మెజారిటీతో గెలిచినా.. అది గొప్ప గెలుపుగానే భావించాలి.
హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ మంచి మెజారిటీతో గెలిస్తే.. జనం మార్పు కోరుకుంటున్నారని అర్థం చేసుకోవచ్చు. అయితే.. జనం మార్పు కోరుకుంటున్నారు సరే.. కానీ.. అధికార పీఠంపై ఎవరిని కూర్చోబెట్టాలనుకుంటున్నారనేది కూడా కీలకమే. టీఆర్‌ఎస్ క్రమంగా జనంలో విశ్వాసం కోల్పోతుందని భావిస్తే.. మరి అధికార పీఠం ఏ పార్టీకి తెలంగాణ ఓటరు కట్టబెట్టే ఆలోచనలో ఉన్నాడో ఎలా పసిగట్టేది.. కేసీఆర్‌పై వ్యతిరేకత ఏ పార్టీకి లాభిస్తుంది.
రాష్ట్రంలోనే గట్టి ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌కు హుజూరాబాద్ ఎన్నికల్లో కేసీఆర్ ఓడితేనే ఎక్కువ రాజకీయ ప్రయోజనం ఉంటుందా.. అన్న ఆలోచన లేకపోలేదు. ఈటల గెలిస్తే.. అధికార పార్టీ బలహీనమైపోయిందన్న విషయం మాత్రం స్పష్టం అవుతుంది. మరి ఈ అవకాశాన్ని భవిష్యత్‌లో ఏ పార్టీ తనకు అనుకూలంగా మలచుకుంటుందో చెప్పలేం..! చూద్దాం.. ఏం జరుగుతుందో..?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి