రాజకీయాలపై కాస్త అవగాహన ఉన్నవారికి ఏపీలో ఉండే పరిస్తితులని కాస్త అంచనా వేయొచ్చని చెప్పొచ్చు. ఇప్పుడు ఉన్న పరిస్తితుల్లో అధికార వైసీపీనే స్ట్రాంగ్‌గా ఉందని రాజకీయం తెలిసిన ప్రతి ఒక్కరికీ అర్ధమవుతుంది. కాకపోతే గత ఎన్నికల్లో ఉన్నంత బలం ఇప్పుడు వైసీపీకి లేదు. అదే సమయంలో గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు టీడీపీ చాలా వరకు పికప్ అయిందని చెప్పొచ్చు. వైసీపీతో ఢీ అంటే ఢీ అనే పరిస్తితికి వచ్చింది. కానీ వైసీపీకే కాస్త ఆధిక్యం ఉందని అర్ధమవుతుంది.

అంటే వైసీపీ-టీడీపీల మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంది. మరి ఈ పోరులో జనసేన పరిస్తితి ఏంటి? ఆ పార్టీ బలం ఇప్పుడు ఎలా ఉందంటే....గత ఎన్నికల్లోనే ఆ పార్టీకి ఒక సీటు గెలిచే బలం వచ్చింది. ఇక ఇప్పుడు కొద్దో గొప్పో బలం పెరిగిందని చెప్పొచ్చు. ఇప్పుడున్న పరిస్తితుల్లో జనసేనకు ఓ 10 సీట్లలో కాస్త స్ట్రాంగ్‌గా ఉందని చెప్పొచ్చు. అలా అని 10 సీట్లు గెలుచుకునే కెపాసిటీ లేదు.

ఆ విషయం రాజకీయం తెలిసిన వారికి బాగా అర్ధమవుతుంది. ప్రధాన పోటీ మాత్రం వైసీపీ-టీడీపీల మధ్యే ఉంది..ఇందులో ఎలాంటి డౌట్ లేదు. మరి జనసేనకు బలం లేకపోయినా పవన్ కల్యాణ్‌కు సీఎం సీటు ఎలా అడుగుతున్నారనేది ఆసక్తిగా ఉంది. ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకోవాలని టీడీపీ చూస్తుంది. జనసేనని కలుపుకుంటే కాస్త వైసీపీని డామినేట్ చేయొచ్చు. కానీ జనసేన మాత్రం కలిసేలా లేదు. పైగా పొత్తు పెట్టుకోవడానికి ఒక షరతు పెడుతున్నారు.

పవన్‌కు సీఎం సీటు ఇస్తేనే...పొత్తు పెట్టుకోవడానికి రెడీ అని జనసేన నేతలు మాట్లాడుతున్నారు. అంటే బలమైన టీడీపీకి గానీ, చంద్రబాబుకి గానీ సీఎం సీటు ఇవ్వకూడదు...కేవలం పవన్‌కు సీఎం సీటు ఫిక్స్ చేస్తేనే పొత్తుకు అంగీకరిస్తామని చెబుతున్నారు. అంటే ఇదంతా అంత తేలికగా అయిపోయే పని కాదు..ఈ ప్రతిపాదనపై టీడీపీ ఏ మాత్రం ఒప్పుకునే పరిస్తితి లేదు. కాబట్టి జనసేన నేతలు ఎంత డిమాండ్ చేసిన వర్కౌట్ అయ్యేలా లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: