టమోటా ధరలు రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి..గత నెల రోజుల నుంచి ధరలు ఆకాశాని కి నిచ్చెనలు వేస్తున్నాయి.ఒకవైపు టమోట ధరలు, మరో వైపు గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతూ సామాన్యుల కు చుక్కలు చూపిస్తున్నాయి. ఇకపోతే గత నాలుగు రొజులు కాస్త తగ్గిన టమోటా ధరలు నేడు మార్కెట్ లో భారీగా పెరిగినట్లు తెలుస్తుంది. మొన్నటి వరకూ కిలో టమోటా ధరలు వందకు పైగా దాటాయి.. అదే ధరలు మార్కెట్ లో కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఇంకాస్త పెరిగినట్లు తెలుస్తుంది..


ఒకసారి మార్కెట్ లో ధరలు ఎలా ఉన్నాయో చూడండి.. తగు ముఖం పట్టిన టమోటా ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. రామకుప్పం, వి. కోట. ఏడోమైలు, కుప్పం, పలమనేరు మార్కెట్లలో ఐదు రోజుల క్రితం వరకు 15 కిలోల బాక్సు రూ.1100 నుంచి రూ.1500 వరకు పలికింది.. నాలుగు రోజులుగా కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్‌ల నుంచి జిల్లాలోని మార్కెట్లకు టమోటాలు చేరుకోవడం తో ధరలు తుగ్గుముఖం పట్టాయి. 15 కిలోల బాక్సు రూ. 650 నుంచి రూ.730కి పడిపోయింది. పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గి పోవడం Sతో గురువారం బాక్సు ధర రూ.700 నుంచి రూ. 750కి పెరిగింది..



శుక్రవారం ధరలు మరింతగా పెరిగాయి. బాక్సు ధర రూ.850 నుంచి రూ.910 వరకు పలికింది. దిగుమతులు తగ్గిపోవడం, జిల్లాలో పలుచోట్ల వర్షాలు పడుతుండటంతో ధరలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. రీటైల్‌ మార్కెట్‌లో కిలో టమోటా రూ.80 నుంచి రూ.90కి చేరాయి.టమోటా ధరలు లాటరీ అన్నట్లుగానే నాలుగు రోజుల నుంచి 15కిలోల బాక్స్‌ ధర రూ.700కు చేరుకుని శుక్రవారం మళ్లీ వేగం పుంజుకుంది. పుంగనూరు మార్కెట్‌లో 15కిలోల బాక్స్‌ గరిష్ఠంగా రూ.870 పలికింది.. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తుంది..ఇంకో వారం లో ఇంకాస్త పెరుగుతాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: