ఏపీలో బిజెపి మార్క్ అసలు సిసలైన రాజకీయాన్ని మొదలుపెట్టింది.. మోడీ చంద్రబాబు కలిసినప్పటికీ ఆయన సీఎం చేయడానికి కాదని సంకేతాలు చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయి.. ప్రధాన మోడీ సభతో ఏదేదో చేద్దామని బ్రమలో ఉన్నటువంటి చంద్రబాబుకు దిమ్మతిరిగేలా చేశారు మోది .. మోదీ ఏపీలో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వెళ్లిపోయే వరకు పక్క ప్లానింగ్ ప్రకారం చేసుకొని వెళ్ళినట్లుగా తెలుస్తోంది. అంతా బిజెపి గేమ్ ఆడినట్టుగానే కనిపిస్తోంది.. మామూలుగా చూస్తే మోడీ ఏపీకి వచ్చిన సమయంలో మిత్రపక్షాలు విమానాశ్రమంలో స్వాగతం పలుకాలి ఆయనతో కలిసి సభ వరకు చేరుతూ ఉంటారు..


గతంలో 2014లో కూడా ఇలాగే జరిగింది. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా గన్నవరం విమానాశ్రయానికి చంద్రబాబు పవన్ రావద్దని బిజెపి చెప్పడంతో అక్కడే బిజెపి నేతలు మాత్రమే మోడీకి స్వాగతం పలికేలా చేశారు. అలా సభ ప్రాంగణానికి రాగానే బిజెపి నేతలు మాత్రమే మోడీకి స్వాగతం పలికారు.. మోదీ వచ్చేవరకు పుల్లారావు సభను స్వయంగా చేయడం జరిగింది. ఆ తర్వాతే సభ పూర్తిగా బీజేపీ చేతుల్లోకి వచ్చేసినట్టుగా కనిపించింది.


అయితే ఈ వేదిక పైన లోకేష్ కి కూడా ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. వేదిక పైన ఉంచిన సభ బ్యానర్ లో కూడా ప్రధాని మోదీ నడ్డా ఫోటోలు మాత్రమే భారీ సైజులోని చూపించారు.. చంద్రబాబు పవన్ ఫోటోలకు ఫ్లెక్సీలలో ఎక్కడ ప్రాధాన్యత కనిపించలేదు. బిజెపి నాయకురాలు పురిందేశ్వరి  స్పీచ్ మాత్రమే ట్రాన్స్లేటర్ గా చేశారు. దీన్ని బట్టి చూస్తే మోడీ పర్యటనలోనే ఈ సభ మొత్తం జరిగినట్లుగా కనిపిస్తోంది. కేవలం సభ ముగిసిన తర్వాత మాత్రమే కూటమి నేతలు అందరూ కలిసి చేతులు పైకెత్తి ఒక ఫోటోలను దిగారు.. అక్కడ కూడా ఆ అవకాశం మోడీ ఇవ్వలేదని తెలుస్తోంది.. ఏది ఏమైనా పొత్తులతో అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా బెంబేలెత్తుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. టిడిపి పార్టీ కోసమే పురిందేశ్వరి సీఎం రమేష్ సుజనా చౌదరి వంటి వారు పనిచేస్తూ ఉన్నారు. ఇలాంటి వారందరికీ ఎంపీ ఎమ్మెల్యేలు టికెట్ ఇవ్వడం లేదని వార్తలు కూడా వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: