తిరుపతి మాజీ టిడిపి ఎమ్మెల్యే సుగుణమ్మ రాజకీయ భవిష్యత్తు మరో రెండు రోజుల్లో పూర్తిగా మారిపోతోంది.. ముఖ్యంగా ఈమెకు టికెట్ లేదని కూడా చాలా క్లారిటీగా రావడంతో ఇప్పుడు ఆమె వెంట ఉన్న నాయకులు కూడా ఆమెతో తిరగడానికి పెద్దగా మక్కువ చూపలేదు. అంతటితో ఆగకుండా నిన్న మొన్నటి వరకు ఆమెకు నీడలా ఉన్నటువంటి ఒక నాయకుడు వెన్నుపోటు పొడవడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.. ఆ వ్యక్తి గతంలో ఎర్రచందనం స్మగ్లర్ గా కూడా చిక్కడంతోపాటు భారీ సొమ్ములను వడ్డీకిస్తూ బలిజ కులాన్ని అడ్డం పెట్టుకొని తిరుపతిలో రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.

ముఖ్యంగా ఇటీవల తిరుపతిలో జనసేనకు సీటు కేటాయించడంతో ఈ సమయంలో .. సీనియర్ నేత సుగుణమ్మ ఈ విషయాన్ని ధిక్కరించడంతో ఆమెకు వ్యతిరేకంగా ఎప్పటికప్పుడు అధిష్టానం పైన పలు రకాల ఫిర్యాదులు కూడా చేస్తున్నాడట. అలా పనిలో పనిగా తన బలాన్ని చూపించి ఏకంగా సుగుణమ్మను పక్కనపెట్టి మరి తిరుపతిలో టిడిపి ఇన్చార్జిగా ఎదగడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే తిరుపతిలో బూత్ లెవెల్ లో టిడిపి నాయకులతో కూడా పలు రకాల రహస్య సమావేశాలను కూడా నిర్వహిస్తున్నారట.


అంతేకాకుండా ఇటీవల కాలంలో జనసేన అభ్యర్థిని వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో కూడా పలు రకాల పోస్టులను షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తిరుపతిలో కూటమి కావడం తాము చేసుకున్న కర్మ అంటూ ఇతర నాయకులతో పాటు పలు రకాల పోస్టులను షేర్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆయనను నియమిస్తే నోటాకు ఓటు వేస్తామంటూ కూడా బెదిరిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ తాజాగా సుగుణమ్మను ఎద్దేవ చేస్తూ రాజకీయంగా ఈమెకు సమయం అయిపోయిందంటూ తెలియజేస్తున్నారు. అలా ఈమె స్థానాన్ని కూడా ఆక్రమించేందుకు పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఆ నాయకుడు. ఇప్పుడు ఈ విషయం అతి పెద్ద సవాలుగా మారుతోంది. ముఖ్యంగా యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని స్మగ్లర్ వడ్డీల వ్యాపారం చేసే ఆ టిడిపి నాయకులకు అధిష్టానం తిరుపతిలో నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారా లేదా అనే విషయం చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: