అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పై అటు బీసీలలో ఎంతలా వ్యతిరేకత వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా బీసీలకు సీట్లు కేటాయించకుండా కెసిఆర్ చిన్నచూపు చూస్తున్నారు అంటూ బీసీలందరూ కూడా నిరసనలు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే బీసీలకు సీట్లు ఇవ్వకపోవడమే అటు అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమి ఒక కారణం కూడా. అయితే ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీసీ నినాదం పట్టుకున్నారు కేసీఆర్.


 ఏకంగా బీసీలకు సీట్లు కూడా ఇచ్చారు. కానీ గెలిచే చోట మరొకరికి ఛాన్స్ ఇచ్చి ఓడిపోయే  చోట మాత్రం బీసీలకు గులాబీ బాస్ చాన్స్ ఇచ్చాడంటూ ప్రచారం జరుగుతుంది. ఆ వివరాలు చూసుకుంటే.. జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్ కి ఛాన్స్ ఇచ్చాడు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే గాలి అనిల్ కుమార్ బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు అన్న విషయం తెలిసిందే. ఆయనకు మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లో మంచిపట్టు ఉంది. అక్కడ ఛాన్స్ ఇస్తే గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కానీ జహీరాబాద్ లో గాలి అనిల్ కుమార్ కి ఛాన్స్ ఇచ్చాడు. అక్కడ గెలిచే ఛాన్స్ తక్కువే.


 ఇక చేవెళ్లలో బీసీ అభ్యర్థి అయిన కాసాని జ్ఞానేశ్వర్ కు ఛాన్స్ ఇచ్చారు. అయితే అక్కడ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి  కాంగ్రెస్ నుంచి.. బిజెపి నుంచి కొండ విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వీరి పోటీని తట్టుకొని కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గెలగలడా అన్నది అందరిలో ఉన్న అనుమానం. ఇంకోవైపు అటు ఎంఐఎం కంచుకోటగా పిలుచుకునే హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో బీసీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ కు ఛాన్స్ వచ్చింది బిఆర్ఎస్. ఎంఐఎం కి ఏ పార్టీ పోటీగా వెళ్లిన ఓడిపోవడం ఖాయం అనేది అందరికీ తెలిసిన విషయమే.


 ఇలా ఓడిపోతాము అని తెలిసిన ఇక ఎంఐఎం కంచుకోట అయిన హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో ఇక బీసీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ కు ఛాన్స్ ఇచ్చింది టిఆర్ఎస్. ఇలా కెసిఆర్ బీసీలకు పెద్దపీట వేస్తున్నామని చెప్పినా.. ఓడిపోయే స్థానాలలోనే ఛాన్సులు ఇచ్చి.. డబుల్ గేమ్ ఆడుతున్నారు అన్నది ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీలోనే ఉన్న బీసీల వాదన. ఇలా బీసీ సామాజిక వర్గానికి పెద్ద పీట వేసాం అని చెప్పిన కేసీఆర్ మాట వెనుక.. కనిపించని మరో నాటకం ఉంది అనే ప్రచారం మాత్రం.. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: