రాయలసీమలో శింగనమల నియోజకవర్గం వర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది.. ముఖ్యంగా అక్కడ నియోజకవర్గంలో ఏ పార్టీకి గెలిస్తే ఖచ్చితంగా అధికారంలోకి కూడా ఆ పార్టీ వస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు.. ఇండియన్ హెరాల్డ్  విశ్లేషణ ప్రకారం..2004 లో అక్కడ కాంగ్రెస్ పార్టీ మీద శైలజనాథ్ గెలువగా అధికారంలోకి కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చింది అలా 2009లో కూడా మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే గెలవక అధికారంలో అదే ప్రభుత్వమే వచ్చింది. 2014లో యామిని బాల టిడిపి అభ్యర్థిగా గెలవగా అధికారంలోకి కూడా అదే పార్టీ వచ్చింది.. 2019లో జొన్నలగడ్డ పద్మావతి వైసిపి పార్టీ నుంచి గెలవక అధికారంలోకి అదే పార్టీ వచ్చింది. అందుకే ఇప్పుడు శింగనమల నియోజకవర్గం రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారుతోంది.


ఇండియన్ హెరాల్డ్ కు అందిన సమాచారం ప్రకారం ఈసారి ఎన్నికల బరిలో వైసిపి పార్టీ నుంచి సామాన్య వ్యక్తి అయినటువంటి డ్రైవర్ వీరాంజనేయులు నిలబెట్టబోతున్నారు.. దీంతో చాలామంది అసహనానికి గురవుతున్నారు వైసీపీ కార్యకర్తలు.. ముఖ్యంగా ఎలాంటి పేరు లేనటువంటి వ్యక్తిని తీసుకురావడంతో పాటు గత ఎమ్మెల్యేగా పనిచేసిన జొన్నలగడ్డ పద్మావతి అనుచరులు చేసిన పనుల వల్ల ప్రజలు కూడా నిరాశతోనే ఉన్నారు. వీటితోపాటు ఎలాంటి పాపులర్ లేని వ్యక్తిని నిలబెట్టడమే కాకుండా అభ్యర్థిని మార్చాలంటూ కూడా పలు రకాల నినాదాలు వైసిపి పార్టీలో వినిపిస్తూనే ఉన్నాయి. దీంతో వైసిపి పార్టీలో అక్కడ బీటలు మారబోతున్నట్లు  ఇండియన్ హెరాల్డ్ విశ్లేషణలో తేలింది.


అయితే టిడిపి అభ్యర్థిగా గతంలో ఓడిపోయిన బండారు శ్రావణి ఈసారి మళ్లీ పోటీకి నిలబడింది.. గతంలో ఓడిపోయిన పట్టుదలతో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తున్న బండారు శ్రావణి కి వీరాంజనేయులు ఒక వరంగా మారబోతున్నారు.. అంతేకాకుండా ఎన్నో గ్రామాలలో  పాదయాత్ర కూడా చేస్తోంది.ముఖ్యంగా అభ్యర్థి నచ్చకపోవడంతో వైసీపీ నాయకులు ఇటీవలే పెద్ద ఎత్తున నాన్న రచ్చ చేశారు. ముఖ్యంగా జొన్నలగడ్డ పద్మావతి వారి యొక్క అనుచరులపై అసహనంతో ఉన్నట్లు తెలిపారు. దీంతో శింగనమలలో టిడిపి వైసిపి మధ్య గట్టి పోటీ నెలకొంది..


ఇండియన్ హెరాల్డ్ విశ్లేషణలో భాగంగా  శింగనమల అభ్యర్థి బండారు శ్రావణి అని ప్రకటించినప్పుడు టిడిపిలో కూడా విభేదాలు బయటపడ్డాయి.. ఇలాంటి సమయంలో వైసీపీ పార్టీ కాస్త పుంజుకున్నట్టుగా కనిపించింది. ఈమధ్య వైసిపి అభ్యర్థి వీరాంజనేయులు కూడా పాదయాత్ర చేస్తూ ప్రజలలో మమేకం అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.. ఒకవేళ శింగనమలలో అభ్యర్థిని వైసీపీ తరఫున మారిస్తే ఖచ్చితంగ అక్కడ భారీ మెజారిటీతో గెలిచే అవకాశం ఉన్నట్లు ఇండియన్ హెరాల్డ్ విశ్లేషణలో తేలింది.


అయితే బండారు శ్రావణి కూడా ఈసారి పట్టుదలతోనే ముందుకు వెళ్తోంది.. బండారు శ్రావణి గత ఏడేళ్లుగా ప్రజలలో బాగా పేరు సంపాదించిన అభ్యర్థి గా నిలిచింది.. ప్రస్తుతమున్న పరిస్థితులలో పైన సీఎం జగన్ బొమ్మ చూసి .. అభ్యర్థి ఎవరని విషయం పట్టించుకోకుండా వేస్తే వైసిపి పార్టీ వస్తుందని.. లేకపోతే అభ్యర్థుల పరంగా వెళితే బండారు శ్రావణి గెలిచే అవకాశాలు ఉన్నట్లు ఇండియన్ హెరాల్డ్ విశ్లేషణలో తేలింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: