ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.. ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో అధికార ప్రతిపక్ష పార్టీలు అలెర్ట్ అయ్యాయి.. నిత్యం ప్రజలలో మమేకం అవుతూ ఒకరిపై ఒకరు విమర్శ ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు.దీనితో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అందులో పల్నాడు రాజకీయాలు మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి..పల్నాడు జిల్లా పరిధిలోని కీలకమైన పార్లమెంటు నియోజకవర్గం నరసరావుపేట. ఇక్కడ నుంచి వైసీపీ తరఫున యువ నాయకుడు, నెల్లూరు ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్ బరిలో నిల్చున్నారు.. 

ఇక, టీడీపీ తరఫున వైసీపీ సిట్టింగ్ ఎంపీ అయిన లావు కృష్ణదేవరాయలు పోటీలో వున్నారు. ఆ నియోజకవర్గంలో లావు కృష్ణదేవరాయులు అభివృద్ధి తప్ప అనవసర రాజకీయం చేయని నేతగా మంచి పేరు తెచ్చుకున్నారు... గతంలో వైసీపీ సిట్టింగ్ ఎంపీగా వున్న లావు శ్రీకృష్ణ దేవరాయలు సామాజిక సంస్కరణలో భాగంగా ఆయనకు సీటు మారుస్తామని వైసీపీ తెలిపింది.. దానికి ఇష్టపడని లావు పార్టీ మారి టీడీపీ తరుపున మరోసారి అదే స్టానంలో పోటీ చేస్తున్నారు.అయితే ఇక్కడ పోటీ చేస్తున్న ఇద్దరూ కూడా యువనాయకులే కావడం విశేషం..ఎన్నికల సమయానికి ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారనేది మాత్రం కీలకం అని చెప్పచ్చు.

ప్రస్తుతం ఈ నియోజకవర్గంలోని ప్రజలకు టీడీపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలుపై పాజిటివ్ ఒపీనియన్ ఉన్నట్లు సమాచారం.. దీనికి ప్రధాన కారణం.. గత ఐదేళ్లలో ఆయన రాజకీయాలకు అతీతంగా అందరికీ అందుబాటులో వున్నారు..ఆ పార్టీ నేతలతో సంబంధం లేకుండా ప్రజలలో మమేకం అయ్యారు.వివాదాలకు కూడా దూరంగా ఉంటూ వచ్చారు..నియోజకవర్గంలో సంక్లిష్టమైన సమస్యగా ఉన్న వరికపూడిసెల ప్రాజెక్టుకు కేంద్రం నుంచి నిదులు తీసుకువచ్చిన ఘనత కూడా లావుకే దక్కుతుంది.ఇలాంటి ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడంతో లావును ప్రజలకు చేరువ చేసింది.ఇక వైసీపీ తరఫున పోటీ లో ఉన్న అనిల్‌ కుమార్ యాదవ్ పేటకు కొత్తకావడంతో నియోజకవర్గంలో ప్రజలకు భరోసా కల్పించడం మానేసి.. సవాళ్లు విసరమే రాజకీయం అన్నట్టుగా పనిచేస్తున్నారు. దీనిని ప్రజలు హర్షించలేక పోతున్నట్లు సమాచారం.. దీంతో లావు గెలుపు ఖాయమనే వాదన నియోజకవర్గంలో గట్టిగా వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: