ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హీట్ మొదలైంది..ప్రధాన పార్టీలు అన్ని కూడా తమ అభ్యర్థుల్ని ప్రకటించేశాయి.కొంతమంది ఆశావాహులకు సీటు దక్కకపోవడం తో కొంత నిరుత్సాహానికి గురి అయ్యారు. అయితే సీటు దక్కని  అభ్యర్థుల అందరిలో ఒక్క పేరు మాత్రం బాగా హైలెట్ అవుతోంది.ఆ పేరే రఘురామకృష్ణరాజు. ఏపీలో జగన్ ప్రభుత్వం గురించి తీవ్ర విమర్శలు చేసిన  వారిలో ఆయన ఒకరు. అందులో సందేహం లేదు. వైసీపీ పార్టీ తరపునే గెలిచినప్పటికీ ఆయన జగన్‌ పై చేసిన పోరాటం మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆందుకే ఆయనను నియోజకవర్గంలో కూడా పర్యటించకుండా వారు కట్టడి చేశారు. ఈ కారణంగా నాలుగేళ్ల పాటు ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. అయినా కూడా ఆయనపై ప్రజల్లో కోపం ఏమాత్రం లేదు. ఆయన పోరాటాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. మళ్లీ నర్సాపురం నుంచే పోటీ చేస్తానని ఆయన ఎంతో ధీమాగా ఉన్నారు..

 కానీ కూటమి పొత్తు లో భాగంగా ఆయనకు సీటు లభించలేదు..మూడు పార్టీల తరపున ఒకే అభ్యర్థిని నిలబెట్టాల్సి రావడంతోనే అసలు రాజకీయం  మొదలైంది..నర్సాపురంలో ఆయన కంటే.. బలమైన అభ్యర్థి కూటమి తరపున ఎవరూ లేరని చెప్పాలి.. కానీ బీజేపీ శ్రీనివాసవర్మ అనే అభ్యర్థికి అవకాశం ఇచ్చింది. ఏ విధంగా చూసినా ఆయన రఘురామ కంటే బలమైన నేత కాదు. మరి రఘురామకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు అనేదే ప్రశ్నగా మారింది.రఘరామ ఆరోపిస్తున్నట్లుగా తన సీటు విషయంలో జగన్ రాజకీయం పని చేసి ఉంటే.. అది ఖచ్చితంగా కూటమి చారిత్రాత్మక తప్పిదమే అవుతుంది.జగన్‌ కు విజయానికి బాటలు వేసినట్లు అవుతుంది. కానీ బీజేపీ అంతర్గత రాజకీయాల మూలంగా సీటు నిరాకరిస్తే మాత్రం అది కూటమి ప్రయోజనాలను దెబ్బకొట్టినట్లే అవుతుంది..ఏవిధంగా చూసినా రఘురామకి ను నర్సాపురం సీటు ఇవ్వడం కూటమికి బలాన్ని చేకూర్చే అంశంగా భావించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: